హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold: బంగారు నగలు ఆన్‌లైన్‌లో కొంటే లాభమా? నష్టమా?

Gold: బంగారు నగలు ఆన్‌లైన్‌లో కొంటే లాభమా? నష్టమా?

Gold: బంగారు నగలు ఆన్‌లైన్‌లో కొంటే లాభమా? నష్టమా?
(ప్రతీకాత్మక చిత్రం)

Gold: బంగారు నగలు ఆన్‌లైన్‌లో కొంటే లాభమా? నష్టమా? (ప్రతీకాత్మక చిత్రం)

Gold Jewellery online shopping | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాదు... నగల వ్యాపారులు కూడా ఆన్‌లైన్‌లో బంగారు నగల్ని అమ్ముతున్నారు. అయితే బంగారు నగల్ని ఆన్‌లైన్‌లో కొనడం లాభమేనా? లేకపోతే ఏమైనా నష్టాలున్నాయా? ఆన్‌లైన్‌లో నగలు కొంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

బంగారం... భారతీయులకు ఆభరణాలు, ఆస్తి మాత్రమే కాదు. సెంటిమెంట్ కూడా. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొనడాన్ని కూడా ఓ వేడుకలా భావిస్తారు. పండుగలు, ఇతర పర్వదినాల్లో బంగారం కొనడాన్ని అదృష్టంగా భావిస్తుంటారు. అందుకే అక్షయ తృతీయ, ధంతేరస్ లాంటి సందర్భాల్లో నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో ఇ-కామర్స్ పెరిగిపోవడంతో ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటుపడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. వారి కోసం ఆన్‌లైన్‌లోనే బంగారు ఆభరణాలు అమ్ముతుండటం సర్వసాధారణమైపోయింది. బంగారు నగలు మాత్రమే కాదు... 24 క్యారట్ గోల్డ్ బిస్కెట్లు, గోల్డ్ కాయిన్స్ కూడా ఇ-కామర్స్ సైట్లల్లో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాదు... నగల వ్యాపారులు కూడా ఆన్‌లైన్‌లో బంగారు నగల్ని అమ్ముతున్నారు. అయితే బంగారు నగల్ని ఆన్‌లైన్‌లో కొనడం లాభమేనా? లేకపోతే ఏమైనా నష్టాలున్నాయా? ఆన్‌లైన్‌లో నగలు కొంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకోండి.

Gold Jewellery online, Gold Jewellery online shopping, Gold Jewellery online shopping benefits, Gold Jewellery online shopping pros and cons, how to buy Gold Jewellery online, బంగారు నగలు ఆన్‌లైన్ షాపింగ్, బంగారు నగలు ఆన్‌లైన్ షాపింగ్ లాభాలు, బంగారు నగలు ఆన్‌లైన్ షాపింగ్ నష్టాలు, బంగారు నగలు ఆన్‌లైన్‌లో ఎలా కొనాలి
ప్రతీకాత్మక చిత్రం

 


ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొంటే లాభాలివే...

ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనడంలో లాభంతో పాటు నష్టం కూడా ఉంది. బంగారు ఆభరణాలపై అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే ఆన్‌లైన్‌లో నగలు కొనడం మంచిది. షాపులో కన్నా ఆన్‌లైన్‌లో మీరు చాలా వెరైటీలు చూడొచ్చు. మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కొన్ని ఎంచుకొని, ఫైనలైజ్ చేయడానికి సమయం కూడా ఉంటుంది. ఆన్‌లైన్‌లో బంగారు ఆభరణాలు కొంటే అనేక పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్‌ మాత్రమే కాదు నెట్ బ్యాంకింగ్, ఇ-వ్యాలెట్ల ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. రిటర్న్, రీప్లేస్ పాలసీ కూడా ఉంటుంది. అంటే మీరు ఆర్డర్ చేసిన నగలు మీ చేతికి వచ్చాక నచ్చకపోతే వాటిని మార్చుకోవచ్చు. లేదా రిటర్న్ చేయొచ్చు. ఇక పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ధంతేరస్, అక్షయ తృతీయ లాంటి పర్వదినాల్లో డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్స్ ఉపయోగించుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొంటే నష్టాలివే...


ఆన్‌లైన్‌లో నగలు కొనడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో నగల్ని ఫోటోల్లో చూసి కొనాలి తప్ప ప్రత్యక్షంగా చూడలేరు. తీరా ఆర్డర్ చేశాక మీరు అనుకున్నట్టు నగలు లేకపోతే నిరాశ చెందాల్సిన పరిస్థితి వస్తుంది. అదే షాపులో అయితే మీరు నగల్ని చేతుల్లోకి తీసుకొని జాగ్రత్తగా పరిశీలించి ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఫోటోల్లో చూసి కొనడానికి, ప్రత్యక్షంగా నగలు చూడటానికి చాలా తేడా ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌లో లాగా షాపులో ఎక్కువ నగల్ని చూడటానికి అవకాశం ఉండదు. షాపులో మీకు తక్కువ ఆప్షన్స్ ఉంటాయి.

Gold Jewellery online, Gold Jewellery online shopping, Gold Jewellery online shopping benefits, Gold Jewellery online shopping pros and cons, how to buy Gold Jewellery online, బంగారు నగలు ఆన్‌లైన్ షాపింగ్, బంగారు నగలు ఆన్‌లైన్ షాపింగ్ లాభాలు, బంగారు నగలు ఆన్‌లైన్ షాపింగ్ నష్టాలు, బంగారు నగలు ఆన్‌లైన్‌లో ఎలా కొనాలి
ప్రతీకాత్మక చిత్రం

ఆన్‌లైన్‌లో నగలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..


ఆన్‌లైన్‌లో నగలు కొనేముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముందు మీరు చూసే సైట్ విశ్వసనీయతను చెక్ చేయాలి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ సైట్లను పోలినట్టు ఉండే నకిలీ సైట్లు అనేకం ఉన్నాయి. మీరు అధికారిక సైట్‌నే ఎంచుకోవాలి. నగలు ఆర్డర్ చేసే ముందు బంగారం స్వచ్ఛత గురించి తెలుసుకోవాలి. ఫోటో చూసి ఆర్డర్ చేయడం కాదు... డిస్క్రిప్షన్‌లో ఉన్న వివరాలు పూర్తిగా చదవాలి. హాల్‌మార్క్ సర్టిఫికేషన్ ఉందో లేదో చెక్ చేయాలి. మేకింగ్ ఛార్జీలు ఎంతో కూడా చూడాలి. నగలు నచ్చగానే ఆర్డర్ చేయకుండా అసలు రిటర్న్ పాలసీ ఎలా ఉందో చూడాలి. ఆన్‌లైన్‌లో కొన్ని వస్తువులకు రిటర్న్ ఆప్షన్ ఉండదు. అంటే మీరు ఆర్డర్ చేసిన తర్వాత రిటర్న్ చేయలేరు. అందుకే రిటర్న్ ఆప్షన్ ఉన్న నగలనే ఎంచుకోవాలి. ఒకవేళ మీకు నచ్చకపోతే వెనక్కి పంపొచ్చు.

కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Gold: భగ్గుమంటున్న బంగారం ధర... అయినా 10% డిస్కౌంట్‌కే కొనొచ్చు ఇలా

Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి

SBI Gold Scheme: మీ నగలు డిపాజిట్ చేస్తే ఎస్‌బీఐ నుంచి వడ్డీ... ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి

First published:

Tags: BUSINESS NEWS, Dhanteras gold, Gold, Gold bars, Gold jewell, Gold jewellery, Gold ornmanets, Gold shops, Online business, Online shopping

ఉత్తమ కథలు