Gold Rate: బంగారం ధరలు మండిపోతున్నాయి...దొంగల నుంచి నగలను కాపాడుకోవాలంటే ఏం చేయాలి..?

10 గ్రాముల బంగారం ధర 0.14 శాతం తగ్గి రూ.37,740కి చేరుకుంది.

ఇంట్లో దాచుకున్నా, ఒంటి మీద పెట్టుకున్నా దొంగల కంటి నుంచి కాపాడలేని పరిస్థితి. ఎందుకంటే పెరిగిన బంగారం ధరలతో దొంగలు ఎంతకైనా తెగించేందుకు సిద్ధమైపోతున్నారు. దీంతో మరి బంగారాన్ని భద్రంగా దాచుకోవడం ఎలా..? చైన్ స్నాచర్ల బారి నుంచి బంగారంను ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై కస్టమర్లలో ఆందోళనలు మొదలయ్యాయి.

  • Share this:
    బంగారం ధరలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ పసిడి కొత్త రికార్డులు బద్దలు కొడుతోంది ఈ నేపథ్యంలో బంగారం ఆభరణాల కొనుగోలు చేయాలంటే కస్టమర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బంగారం తులం ధర ముందు ముందు అరలక్ష తాకే అవకాశం ఉందనే సూచనలు వినిపిస్తున్నాయి. మరి ఇంత ధర వెచ్చించి నగలు కొనుగోలు చేస్తున్న పసిడి ప్రేమికులకు బయట దొంగల భయం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంట్లో దాచుకున్నా, ఒంటి మీద పెట్టుకున్నా దొంగల కంటి నుంచి కాపాడలేని పరిస్థితి. ఎందుకంటే పెరిగిన బంగారం ధరలతో దొంగలు ఎంతకైనా తెగించేందుకు సిద్ధమైపోతున్నారు. దీంతో మరి బంగారాన్ని భద్రంగా దాచుకోవడం ఎలా..? చైన్ స్నాచర్ల బారి నుంచి బంగారంను ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై కస్టమర్లలో ఆందోళనలు మొదలయ్యాయి.

    Gold price, Gold price all time high, hyderabad gold rate, hyderabad silver rate, latest gold price, latest silver rate, బంగారం ధర, హైదరాబాద్ గోల్డ్ రేట్, హైదరాబాద్ వెండి ధర, తులం బంగారం రేటు, తులం వెండి రేటు
    బీమాతో నగలు సురక్షితం


    అయితే బంగారం దాచుకోవాలి అనగానే మనందరికీ గుర్తుకువచ్చేవి బ్యాంకు లాకర్లే. కానీ బ్యాంకు లాకర్లు కూడా పూర్తి సురక్షితం అనుకుంటే పొరపాటే, ప్రకృతి విపత్తులు సంభవించినా, అగ్ని ప్రమాదాలు తలెత్తినా లాకర్లు ఏమి చేయలేవు. నిజానికి మనదేశంలో ఉన్న బంగారం మదుపుదారుల్లో దాదాపు 87 శాతం మంది ఫిజికల్ గోల్డ్‌ను ఆభరణాల రూపంలోనే కొనేందుకు మొగ్గు చూపుతున్నారని తేలింది. మరి ఇలాంటి సందర్భంలో బంగారు ఆభరణాలను కాపాడుకునేందుకు జువెలరీ బీమానే దిక్కు అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మన దేశంలో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నప్పటికీ ఆభరణాల ఇన్సురెన్స్ అవగాహన విషయంలో మాత్రం వెనుకబడింది.

    Gold price, Gold price all time high, hyderabad gold rate, hyderabad silver rate, latest gold price, latest silver rate, బంగారం ధర, హైదరాబాద్ గోల్డ్ రేట్, హైదరాబాద్ వెండి ధర, తులం బంగారం రేటు, తులం వెండి రేటు
    లాకర్ల కన్నా జువెలరీ బీమానే సురక్షితం...


    ఇప్పటికే మార్కెట్లో ఉన్న పలు బీమా సంస్థలు ఆభరణాల బీమాను గృహ బీమా పాలసీలో భాగంగా కల్పిస్తున్నారు. ఆభరణాల బీమా వల్ల ప్రమాదవశాత్తూ నగలు దొంగతనానికి గురైనా, అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరిత్యాల నుంచి రక్షణ లభిస్తుంది. బీమా ద్వారా నగలకు అన్నిరకాల నష్టాల నుంచి పరిహారం లభిస్తుంది. అయతే దీనికి సంబంధించిన ప్రీమియం మాత్రం వస్తువుల విలువను బట్టి వసూలు చేస్తారు. క్లెయిం చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు పాలసీని బట్టి పరిహారం లభిస్తుంది. అయితే పాలసీ తీసుకునేటప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా పొందటం తప్పనిసరి. అలాగే పాలసీ పూర్తివివరాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.
    First published: