Hallmark gold: జూన్ 1 నుంచి బంగారం కొనే రూల్స్ లో మార్పులు...తెలుసుకోండి...

ప్రతీకాత్మకచిత్రం

జూన్ 1 నుంచి ఆభరణాలకు 14, 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంటుంది.

  • Share this:
    బంగారు ఆభరణాలకు తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ చేసే గడువును  2021 జూన్ 1 తో ముగియనుంది. నిజానికి 2021 జనవరి 15 నుండి దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు మరియు కళాఖండాల హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ COVID-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని దాన్ని జూన్ 1 వరకూ పొడిగించారు. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో...హాల్‌మార్కింగ్‌ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) లో ప్రమాణాలు ప్రవేశపెట్టింది. అయితే కరోనా వల్ల తమ వ్యాపారం దెబ్బతిన్నదని అందుకే సమయం పొడిగించాలని జ్యువెలర్స్ కేంద్రానికి ఒక అభ్యర్థన చేశారు. COVID-19 సంక్షోభం నేపథ్యంలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో మేము జనవరి 15 నుండి జూన్ 1, 2021 వరకు గడువును పొడిగించాము" అని కేంద్ర మంత్రి పాస్వాన్ వర్చువల్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

    Gold price today, Gold rate today, sovereign gold bonds, sovereign gold bonds secondary market, sovereign gold bonds nse, sovereign gold bonds bse, how to buy sovereign gold bond, బంగారం ధర, ఈరోజు బంగారం ధర, సావరిన్ గోల్డ్ బాండ్, సావరిన్ గోల్డ్ బాండ్ సెకండరీ మార్కెట్, సావరిన్ గోల్డ్ బాండ్ ఎన్ఎస్‌ఈ, సావరిన్ గోల్డ్ బాండ్ బీఎస్‌ఈ, సావరిన్ గోల్డ్ బాండ్ ఎలా కొనాలి
    ప్రతీకాత్మకచిత్రం


    జూన్ 1 నుంచి ఆభరణాలకు 14, 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంటుందని కేంద్రమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. గడువును పొడిగించాలని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (ఎజిజెడిసి), ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశాయన్నారు. "లాక్ డౌన్ కారణంగా, ఆభరణాల అమ్మకాలు కార్యకలాపాల కోసం దాదాపు మూడు నెలలు కోల్పోయామని. అమ్మకాలు తిరిగి ట్రాక్ లోకి అవ్వడానికి మరో 3-4 నెలలు పడుతుంది. AGJDC వైస్ -చైర్మన్ షాంకర్ సేన్ ఇటీవల కేంద్రానికి వినతి పత్రం సమర్పించారు.

    gold rate today, Gold Price, mcx, stock brokers, the chinese communist party, gold price today, Gold, silver, silver price, gold price India, silver price today in hyderabad, gold and silver price today, silver price chart india, silver price mcx, silver rate today, 24 karat gold rate, 22 karat gold price, తులం వెండి రేటు, తులం వెండి ధర, హైదరాబాద్ వెండి ధరలు, ఈరోజు బంగారం ధర, నేటి బంగారం ధరలు
    ప్రతీకాత్యకచిత్రం


    BIS ఇప్పటికే ఏప్రిల్ 2000 నుండి బంగారు ఆభరణాల కోసం హాల్‌మార్కింగ్ పథకాన్ని నడుపుతోంది. ప్రస్తుతం మార్కెట్లో 40 శాతం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 28,849 ఆభరణాల తయారీదారులు బిఐఎస్ నమోదు చేసింది.

    క్లిక్ చేసి ఈ వీడియో చూడండి..



    BIS ప్రకారం, తప్పనిసరి హాల్‌మార్కింగ్ వల్ల బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా ఉంటారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే భారతదేశం అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో మొదటి స్థానంలో ఉంది, ఇది ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ను తీరుస్తుంది. వాల్యూమ్ పరంగా, దేశం ఏటా 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.
    Published by:Krishna Adithya
    First published: