Gold Rates: తెరుచుకున్న బంగారం షాపులు..తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

జువెలరీ షాపుల వారు కస్టమర్ల కోసం థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. అలాగే మాస్కులు, గ్లౌజులు ధరించడం తప్పనిసరి. సిబ్బంది, కస్టమర్ల కోసం సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.

news18-telugu
Updated: June 6, 2020, 1:42 PM IST
Gold Rates: తెరుచుకున్న బంగారం షాపులు..తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గత 70 రోజులుగా మూసివేసిన బంగారు ఆభరణాల దుకాణాలు (Gold Jewelry Shop)ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. కరోనా కారణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో, ఆభరణాలు కొనడానికి వెళితే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గడిచిన రెండు రోజులలో బంగారం ధరలలో పెద్ద పతనం జరిగింది. శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.47,268 రూపాయలు పలికింది. గురువారం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 274 తగ్గి, ఆ తర్వాత రూ .47,185 స్థాయికి పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని పలు నగరాల్లో ఆభరణాల దుకాణాలు ప్రారంభమయ్యాయి. షాపుల వారు కస్టమర్ల కోసం థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. అలాగే మాస్కులు, గ్లౌజులు ధరించడం తప్పనిసరి. సిబ్బంది, కస్టమర్ల కోసం సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.

ప్రవేశ ద్వారం వద్ద సాటిజైర్లను అందుబాటులోకి తెచ్చారు. ఆభరణాలను శుభ్రపరుస్తున్నారు. ఆభరణాలను, UV కిరణాలతో సానిటైజ్ చేస్తున్నారు. కస్టమర్ ఆభరణాలను తాకిన తర్వాత UV కిరణాలు ప్రసరించే బాక్స్ లో పెడతారు. అప్పుడు వైరస్ ఉంటే నశిస్తాయి. UV కిరణాల వల్ల బంగారం నాణ్యతపై ఎలాంటి ప్రభావం చూపవని జ్యువెలర్స్ చెబుతున్నాయి.

కస్టమర్లను ఆకర్షించడానికి, జ్యువెలరీ షాపులు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఎందుకంటే లాక్ డౌన్ కారణంగా డిమాండ్ బాగా తగ్గింది. అటు ప్రజలు కరోనా నేపథ్యంలో బంగారు బాండ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం సమయంలో స్టాక్ మార్కెట్లో గందరగోళం ఎక్కువగా కనిపిస్తే బంగారంపై పెట్టుబడి ఉత్తమ ఎంపికగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే బంగారంపై పెట్టుబడి తక్కువ ప్రమాదకారిగా ఉండటంతో పాటు మంచి రాబడి ఉంటుంది. గడిచిన సంవత్సరంలో, బంగారంపై 40 శాతం రాబడి లభించింది.

ప్రపంచ బంగారు మండలి నివేదిక ప్రకారం, 2020 మొదటి త్రైమాసికంలో బంగారానికి విపరీతమైన పెట్టుబడి డిమాండ్ ఉంది. ఈ సంవత్సరంలో బంగారం డిమాండ్ 80 శాతం పెరిగి 539.6 టన్నుల వద్ద ఉంది. కరోనా వైరస్ మహమ్మారి యొక్క ఆర్థిక ప్రభావం గురించి అనిశ్చితి ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్, మూడీస్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు ప్రపంచ వృద్ధి అంచనాలను బాగా తగ్గించాయి. అందుకే బంగారంపై పెట్టుబడులు పెట్టడం సురక్షితమైనవిగా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
First published: June 6, 2020, 1:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading