GOLD IS GOING TO FALL SILVERS SHINE HAS ALSO FADED KNOW THE LATEST RATE MK
Gold: బంగారం కొనేందుకు సరైన సమయం ఇదేనా..? పెళ్లిల్ల సీజన్ వరకూ ఆగాలా...నిపుణుల సలహా ఏంటి..?
(ప్రతీకాత్మక చిత్రం)
Gold: రానున్న పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కొంటున్నారా...అయితే ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా స్పాట్ బంగారం అంటే ఆభరణాలు కొనుగోలు చేసుకునే వారు ఇప్పుడే కొనుగోలు చేసుకుంటే భవిష్యత్తులో జేబుకు చిల్లుపడకుండా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gold: రానున్న పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కొంటున్నారా...అయితే ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా స్పాట్ బంగారం అంటే ఆభరణాలు కొనుగోలు చేసుకునే వారు ఇప్పుడే కొనుగోలు చేసుకుంటే భవిష్యత్తులో జేబుకు చిల్లుపడకుండా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం గోల్డ్ విషయానికి వస్తే దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం బంగారం ధర రూ.597 తగ్గి 10 గ్రాములకు రూ.46,814కి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్లో, బంగారం 10 గ్రాములకు రూ.47,116 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ సెషన్లో కిలో వెండి రూ.61,222 నుంచి రూ.369 తగ్గి రూ.60,625కి చేరుకుంది. అటు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 1,804 డాలర్లు, వెండి ఔన్స్‌కు 22.83 డాలర్లుగా ట్రేడవుతున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ తెలిపారు. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.302 తగ్గింది. COMEXలో బంగారం ధరలు తగ్గిన తర్వాత దేశీయంగా కూడా ఈ తగ్గుదల గమనించవచ్చు. విశేషమేమిటంటే గ్లోబల్ మార్కెట్లో ఇప్పటి వరకూ బంగారం ధరలో దాదాపు 3.6 శాతం క్షీణత నమోదు అయ్యింది. 2015 తర్వాత అతిపెద్ద వార్షిక క్షీణత ఇదే కావడం విశేషం. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి కరోనా మహమ్మారి సమయంలో తీసుకున్న ఉపశమన చర్యలను సెంట్రల్ బ్యాంకులు క్రమంగా వెనక్కి తీసుకుంటున్నాయి. దీని ప్రభావం బంగారం ధరలపై కనిపిస్తుంది. అటు స్టాక్ మార్కెట్లు సైతం పుంజుకోవడం ఒక కారణంగా చెబుతున్నారు.
అయితే మరోవైపు బంగారం ధరలు పతనం సమయంలో స్పాట్ బంగారం ప్రియులు ఒడిసి పట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిల్ల సీజన్ రానున్న నేపథ్యంలో అప్పటి వరకూ వేచి ఉండకుండా, వెంటనే బంగారం కొనుగోలు చేసుకుంటే కాస్త అయినా మీ జేబుకు చిల్లు పడకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అటు బంగారం ధరలు ఆకాశం నుంచి నెమ్మదిగా దిగి వస్తన్నాయి. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ కూడా పంజా విసురుతోంది. ముఖ్యంగా యూరప్, అమెరికా మార్కెట్లపై దీని ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మార్చిలో మరింత ఉధృతంగా కరోనా కేసులు విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం ఆభరణాల కోసం కొనుగోలు చేసేవారికి ఇది సరైన సమయం అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం గడిచిన కొన్ని సంవత్సరాలుగా గమనిస్తే 2020లో గరిష్ట స్థాయిని అందుకుంది. కానీ 2021లో మాత్రం స్థిరంగా కదలాడింది. ఇక 2022లో మాత్రం స్టాక్ మార్కెట్లు ఊగిసలాడితే మాత్రం బంగారంపై పెట్టుబడులు పెరిగి ధరలు పెరిగే అవకాశం స్పష్టంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే బంగారం ధరలు తగ్గినప్పుడల్లా కొద్ది మొత్తంలో కొనుగోలు చేస్తుంటే మంచి అసెట్ అవుతుందని సైతం నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీ పెట్టుబడులు, ఆర్థిక సలహాల కోసం సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించండి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.