Home /News /business /

GOLD IS GETTING CHEAP AT RS 8800 FROM RECORD HIGH GREAT OPPORTUNITY TO BUY MK

Gold Rate Today: తులం బంగారం ధర ఏకంగా రూ.8800 పతనం..మహిళలకు గుడ్ న్యూస్..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today: సోమవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో పతనం కనిపిస్తోంది. బంగారం ధరలు (24 కారట్ల నాణ్యత) రూ.47,400 స్థాయి కంటే దిగువకు పడిపోయాయి. బంగారంతో పాటు వెండి ధరల్లో క్షీణతను నమోదు చేసింది.

    Gold Rate Today: సోమవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో పతనం కనిపిస్తోంది. బంగారం ధరలు (24 కారట్ల నాణ్యత) రూ.47,400 స్థాయి కంటే దిగువకు పడిపోయాయి. బంగారంతో పాటు వెండి ధరల్లో క్షీణతను నమోదు చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ఫ్యూచర్స్ ఈ ఉదయం 09.23 గంటలకు రూ. 122 లేదా 0.26% తగ్గి 10 గ్రాములకు రూ. 47,330 వద్ద ట్రేడవుతున్నాయి. గతవారం ట్రేడింగ్ ముగింపు సమయంలో బంగారం ధర రూ.47,452 వద్ద చేరుకుంది. ప్రస్తుతం మాత్రం బంగారం సగటు ధర రూ. 47,375.55 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, MCX సిల్వర్ మార్చ్ ఫ్యూచర్స్ రూ. 60,607 వద్ద ముగిసింది, ఇది ఈ రోజు కిలోకు రూ. 253 లేదా 0.42% తగ్గి రూ. 60,354 వద్ద ఉంది. దీని సగటు ధర కిలో రూ.60,365.82గా ఉంది.

    అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం పరిస్థితి ఇది..

    అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.27 శాతం తగ్గి 1,792.11 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, వెండి 0.58% క్షీణించి ఔన్స్ 22.24 డాలర్ల  స్థాయిలో ఉంది.

    iQoo 7 5G: కొత్త ఫోన్ కొంటారా? ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది

    చౌకగా బంగారాన్ని కొనుగోలు చేసే గొప్ప అవకాశం

    డిసెంబర్ 10, 2021న, బంగారం ధర 10 గ్రాములకు రూ.47,800గా పలికింది. అయితే ఒమిక్రాన్ నేపథ్యంలో అనిశ్చితి నెలకొంది. ఓమిక్రాన్ వేరియంట్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో మాత్రం ఇంకా బలంగానే ఉన్నాయి. అనేక కారణాల వల్ల, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా ఉంది. దీని కారణంగా బంగారం అనుకున్న స్థాయిలో పుంజుకోవడం లేదు. నెల రోజుల్లో బంగారం ధరల్లో రూ.520 వ్యత్యాసం కనిపించింది. అదే సమయంలో ఆగస్టు 2020లో బంగారం ధర రూ. 56,200 వద్ద సరికొత్త గరిష్ట స్థాయిని నమోదుచేసింది. అప్పటి నుంచి బంగారం ఈ స్థాయిని తాకలేకపోయింది. ప్రస్తుత బంగారం ధర గరిష్ట  స్థాయి నుంచి రూ.8,800 దిగువకు పడిపోయింది.

    Jio New Plan: జియో నుంచి కొత్త ప్లాన్... 912జీబీ డేటా వాడుకోవచ్చు

    ఢిల్లీలో బంగారం ధరలు ఇవే...

    ఇదిలా ఉంటే అంతర్జాతీయ ధరల పతనం కారణంగా, ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర రూ.301 తగ్గి 10 గ్రాములకు రూ.46,415 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.46,716 వద్ద ముగిసింది. అదే సమయంలో, వెండి ధర కూడా కిలోకు రూ.402 తగ్గి రూ.59,044 వద్ద ముగిసింది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Gold Prices Today

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు