Gold News | ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రాజకీయ సమీకరణాలతో స్టాక్ మార్కెట్లు (Stock Market) ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో డాలర్ విలువ పెరుగుతోంది. ఈ ప్రభావం ఇండియాలో బంగారం ధరలపై (Gold Rate) కనిపిస్తోంది. వివిధ స్టాక్‌ల ధరలు తగ్గుతుండటం, బంగారం ధరలూ పడిపోవడంతో ఈ సమయంలో వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? లేదా? అని చాలామందికి సందేహాలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్ల పెంపుపై దృష్టి పెడుతున్నాయి. దీంతో 2022లో బంగారం ధరలు తగ్గాయి. పండుగల సీజన్లో భారతీయులు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారు. పెళ్లిళ్ల సీజన్‌తో పాటు దీపావళి కూడా సమీపిస్తుండటంతో.. బంగారం అమ్మకాలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రేడ్‌బుల్స్ సెక్యూరిటీస్‌లో సీనియర్ కమోడిటీ/కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ భావిక్ పటేల్ News18.comకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాల గురించి మాట్లాడారు. పెట్టుబడిదారులు ఈ పండుగ సీజన్లో బంగారంపై పెట్టుబడి పెట్టాలా? వద్దా? అనే ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. అవేంటో తెలుసుకోండి.
ఈరోజు నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. దీపావళి ముందు కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ
ఆరు నెలలుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయమా?
మీడియం టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు అయితే ఇది సరైన సమయం. ఫిజికల్ గోల్డ్ మార్కెట్, పేపర్ గోల్డ్ మార్కెట్ మధ్య వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. డెరివేట్ లేదా పేపర్ గోల్డ్ మార్కెట్ బంగారం ధరలు బలమైన US డాలర్, ట్రెజరీ దిగుబడి కారణంగా ఒత్తిడికి గురవుతున్నాయి. ఫిజికల్ మార్కెట్లో సప్లై టైట్నెస్తో ప్రీమియంలు పెరగడం చూశాం. చైనా బంగారం దిగుమతి నాలుగేళ్ల గరిష్టానికి చేరుకుంది. 2023 మొదటి త్రైమాసికం తర్వాత US ఫెడ్ రేట్లను తగ్గించిన తర్వాత బంగారం ధర పెరగవచ్చు. కాబట్టి బంగారం కొనడానికి ఇది మంచి అవకాశం.
పెట్టుబడి పెట్టే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి?
ఈక్విటీ మార్కెట్లో షార్ట్ టైం ట్రేడర్స్, స్పెక్యులేటర్ల మాదిరిగా బంగారంలో ఇన్వెస్ట్ చేయలేరు. బంగారంపై పెట్టుబడి పెట్టే ముందు రిస్క్, టెన్యూర్ గుర్తుంచుకోవాలి. బంగారం పోర్ట్‌ఫోలియో లేదా క్యాపిటల్‌ను సురక్షితంగా ఉంచేందుకు హెడ్జింగ్లా కూడా ఉపయోగపడుతుంది.
ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఫోన్ కొంటే రూ.10 వేల డిస్కౌంట్!
ప్రస్తుతం బంగారాన్ని ఎలా కొనుగోలు చేయడం మంచిది?
ఇది కొనుగోలుదారుల అవసరంపై ఆధారపడి ఉంటుంది. అవసరాన్ని బట్టి మారుతుంది. ఇప్పుడు గోల్డ్ బాండ్లు, ఈటీఎఫ్‌లు వంటి మార్గాల్లో కూడా పెట్టుబడులు చేయవచ్చు. ఎవరైనా బహుమతి కోసం పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే, నాణేలు లేదా ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడి ప్రయోజనాల కోసం అయితే బాండ్లు లేదా ETFలలో పెట్టుబడి పెట్టాలి. బాండ్లు సంవత్సరానికి 2.5 శాతం వడ్డీని ఇస్తాయి.
పాత బంగారాన్ని అమ్మే వారికి సలహా?
పాత బంగారాన్ని అమ్మాలని చూస్తున్న వారు డబ్బు అవసరం అయినప్పుడు లేదా కొత్త ఆభరణాలను కొనుగోలు చేస్తున్నప్పుడే దాన్ని విక్రయించాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, భవిష్యత్తులో బంగారం ధరలు తిరిగి మెరుగవుతాయి.
బంగారాన్ని కొనుగోలు చేసే మార్గాలు ఏంటి?
ఇన్వెస్ట్మెంట్ అవసరాలకు అయితే.. లాంగ్ టర్మ్ బాండ్లు లేదా ఈటీఎఫ్‌ల ద్వారా గోల్డ్‌ను కొనుగోలు చేయవచ్చు. షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం MCX ద్వారా ఫ్యూచర్స్ లేదా ఆప్షన్స్ కొనుగోలు చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold jewellery, Gold Price Today, Gold rate hyderabad, Gold Rate Today