హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Imports: పడిపోయిన డిమాండ్.. భారీగా పతనమైన బంగారం, వెండి దిగుమతులు!

Gold Imports: పడిపోయిన డిమాండ్.. భారీగా పతనమైన బంగారం, వెండి దిగుమతులు!

Gold Imports: పడిపోయిన డిమాండ్.. భారీగా పతనమైన బంగారం, వెండి దిగుమతులు!

Gold Imports: పడిపోయిన డిమాండ్.. భారీగా పతనమైన బంగారం, వెండి దిగుమతులు!

Gold Rate | దేశంలో బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. వెండి దిగుమతులు కూడా ఇదే దారిలో నడిచాయి. డిమాండ్ పడిపోవడంతో గోల్డ్, సిల్వర్ దిగుమతులు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Gold Price | పసిడి వెలవెలబోయింది. బంగారం నేలచూపులు చూస్తోంది. దేశంలో దిగుమతులు భారీగా తగ్గాయి. వెండి దిగుమతులు కూడా క్షీణించాయి. అక్టోబర్ నెలలో గోల్డ్ (Gold) సిల్వర్ (Silver) దిగుమతులు తగ్గుముఖం పట్టాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంటోంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో బంగారం దిగుమతులు ఏకంగా 17.3 శాతం మేర క్షీణించాయి. దీంతో బంగారం దిగుమతులు 24 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యాయి. డిమాండ్ తగ్గడంతో దిగుమతులు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.

వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గత ఏడాది ఇదే కాలంలో బంగారం దిగుమతులు 29 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యాయి. వెండి దిగుమతుల విషయానికి వస్తే.. సిల్వర్ దిగుమతులు ఏకగా 34.8 శాతం మేర తగ్గాయి. 585 మిలియన్ డాలర్లుగా నమోదు అయ్యాయి. అయితే మొత్తంగా చూస్తే మాత్రం దిగుమతులు 4.8 బిలియన్ డాలర్లకు చేరాయి. 2021-22 ఏప్రిల్ అక్టోబర్ మధ్య కాలంలో మొత్తం దిగుమతులు 1.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. ఈ వారంలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంత తగ్గాయంటే?

2022 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో మర్చండైజన్ ట్రేడ్ డెఫిసిట్ 173.46 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాది కిందట ఇది 94.16 బిలియన్ డాలర్లు. అయితే జెమ్స్ అండ్ జువెలరీ ఎగుమతులు మాత్రం స్వల్పం పైకి కదిలాయి. 1.81 శాతం పెరిగాయి. 2022 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఇవి 24 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యాయి.

కొత్తగా బైక్ , స్కూటర్ కొనాలనుకునే వారికి షాక్.. ఒకటో తేదీ నుంచి..

పరిశ్రమ నిపుణుల ప్రకారం చూస్తే.. 2023 జనవరి నుంచి మళ్లీ డిమాండ్ పుంజుకోవచ్చు. కాగా ఈ నెల కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై బేస్ దిగుమతి సుంకాలను పెంచి విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు పెరగడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. బంగారంపై సుంకాలు పది గ్రాములకు 570 డాలర్లుగా ఉన్నాయి. అలాగే వెండిపై దిగుమతి సుంకం కేజీకి 702 డాలర్లుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం ప్రభావం కారణంగా బంగారం డిమాండ్ తగ్గొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవలనే అంచనా వేసింది.

బంగారం దిగుమతులు దిగిరావడం వల్ల వాణిజ్య లోటు కూడా తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల రూపాయి బలోపేతం అయ్యే ఛాన్స్ ఉంటుంది. దేశంలో బంగారం డిమాండ్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటుంది. కాగా సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాంగ్ 14 శాతం మేర పెరిగింది. 191 టన్నులుగా నమోదు అయ్యింది. పండుగ సీజన్ ఇందుకు ప్రధాన కారణం. డిసెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ దాదాపు 250 డాలర్లకు తగ్గొచ్చనే అంచనాలు ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో పసిడి డిమాడ్ 343 టన్నులుగా ఉంది.

First published:

Tags: Gold, Gold price, Gold Price Today, Gold rate

ఉత్తమ కథలు