ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు భారీగా తగ్గాయి. ఏప్రిల్ - ఫిబ్రవరి మాసం వరకు సుమారు రూ.1.90 లక్షల కోట్ల విలువైన పసిడి దేశంలోకి దిగుమతయ్యింది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో అదే కాలంలో రూ.2.08 లక్షల కోట్ల పసిడి దిగుమతయ్యింది. దీంతో పోలిస్తే ఈ సారి 8.86 శాతం దిగుమతి తగ్గిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గత ఏడాది డిసెంబరు మాసం నుంచి బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో డిమాండ్ తగ్గి, దిగుమతులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు మార్కెట్ల వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ప్రతియేటా మన దేశం దాదాపు 800-900 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి...దీంతో విక్రయాలు పెరిగి దిగుమతులు మళ్లీ జోరందుకునే అవకాశముంది.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.