బంగారం వ్యాపారం అనుకున్నంతగా సాగక పోవడంతో బంగారం బేల చూపులు చూస్తోంది. నూతన కొనుగోళ్లు లేకపోవడంతో వరుస సెషన్లలో బంగారం ధర తగ్గింది. నగల వ్యాపారులు, ట్రేడర్ల నుంచి సంతృప్తికర డిమాండు రాకపోవడంతో బంగారం ధర పతనం అవుతోంది. ముఖ్యంగా గురువారం నాడు ముంబై రిటైల్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.48,986 వద్ద స్థిర పడింది. డాలర్‌తో రూపీ మారకపు విలువ పడిపోవడం, గ్లోబల్ క్యూస్ బలహీనంగా ఉండటంతో బంగారం ధరల్లో అస్థిరతలు కనిపించాయి. 22 క్యారెట్ల గోల్డ్ 10 gm ధర రూ.44,871 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం, 10 gm వచ్చేసి రూ.48,986 ( GST అదనం) గా ఉంది. ఇక 18 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.36,740 వద్ద ఉంది.
కాగా 2020 లో మన దేశంలో బంగారం దిగుమతులు తగ్గాయి. 2020లో గోల్డ్ డిమాండ్ 35 శాతం క్షీణించి 446.4 టన్నులుగా ఉంది. 2019లో బంగారం దిగుమతులు 690.4 టన్నులుగా ఉండటం గమనార్హం. బంగారు ఆభరణాల విషయంలో కూడా డిమాండ్ 42 శాతం పడిపోయి 315.9 టన్నులుగా ఉంది. గత 2019 లో ఇది 544.6 టన్నులుగా ఉండేది. బుధవారం నాడు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన "గోల్డ్ డిమాండ్ ట్రెండ్ రిపోర్ట్ ఫర్ 2020 " నివేదికలో ఈ వివరాలు పొందు పరచబడ్డాయి.
2020లో దేశీయంగా కోవిడ్ మహమ్మారి వల్ల, లాక్ డౌన్ వల్ల, ఆర్ధిక వ్యవస్థ మందగించడం, అధిక ధరలు వంటి కారణాలతో బంగారు ఆభరణాల డిమాండ్ తగ్గిందని బులియన్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 2019 తో పోలిస్తే 2020లో బంగారం ధరలు 14 శాతం పెరిగాయి. ఒక దశలో వార్షిక ప్రాతిపదికన పోలిస్తే బంగారం ధర 34 శాతం పెరిగి రూ.50,000 (10 gms) కూడా చేరింది. దీంతో ఆభరణాల కొనుగోళ్ళు మందగించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold ornmanets, Gold rates