Gold: బంగారం ధర పెరుగుతుందా...తగ్గుతుందా...కరోనాతో పసిడి బాట ఎటు వైపు...

కరోనా ఎఫెక్ట్ నుంచి బయట పడిన తర్వాత అభివృద్ధి చెందిన దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సహా పలు యూరప్ దేశాలు తమ పసిడి నిలువలను ప్రపంచ మార్కెట్ లో అమ్మకానికి పెట్టే అవకాశం ఉందని, అప్పుడు బంగారం ధరలు పతనమయ్యే చాన్స్ ఉందనే విశ్లేషణలు కూడా ఏర్పడుతున్నాయి.

news18-telugu
Updated: April 4, 2020, 4:17 PM IST
Gold: బంగారం ధర పెరుగుతుందా...తగ్గుతుందా...కరోనాతో పసిడి బాట ఎటు వైపు...
బంగారం
  • Share this:
Gold Rate in Hyderabad : బంగారం ధరల్లో సందిగ్ధత నెలకొంది. అయితే ఓ వారం భారీగా పెరిగితే, మరో వారం భారీగా పతనం అవుతున్నాయి. దీంతో పసిడి బాట ఎటువైపు అనేది బులియన్ పండితులకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. (gold rate in hyderabad today) ఇప్పటికే రూ.45 వేల మార్క్ క్రాస్ చేసి ఆల్ టైం రికార్డు అందుకుంది. అయితే మళ్లీ ఆ స్థాయి నుంచి పతనమైంది. ఇదంతా గడిచిన నెల రోజుల వ్యవధిలో చోటుచేసుకుంది. ఓ దశలో పసిడి ధరలు ఆల్‌టైం రికార్డుల మోత మోగిస్తూ ఏడు సంవత్సరాల రికార్డు స్థాయిన తాకింది. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ విజృంభించడంతో ప్రపంచ ఆర్థిక ప్రగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలోని సొమ్మును మదుపరులు భద్రమైన పెట్టుబడి సాధనమైన బంగారం, వెండి వైపు తరలిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కె ట్లో డిమాండ్‌ ఊపందుకుంది. తత్ఫలితంగా ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర మరోసారి 1,600 డాలర్ల ఎగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగానూ విలువైన లోహాల రేట్లు ఎగబాకాయి. అమెరికా, యూరప్ లో కరోనా దెబ్బతో మరణాలు ఒక్కసారిగా వేలల్లోకి చేరడంతో పాటు ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు చమురు ధరలు సైతం భారీగా పతనమవుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ క్రూడాయిల్ ధర 30 డాలర్ల దిగువకు పతనమైంది. దీంతో అందరి కన్ను సేఫ్ పెట్టుబడిగా భావించే బంగారంపై పడింది. ముఖ్యంగా ఇన్వెస్టర్లు కరోనా వైరస్ భయాలతో ఉత్పత్తి మందగించిందని, అంచనాకు వస్తున్నారు. కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు 2 నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్‌) దాకా నష్టపోవచ్చని ఏడీబీ పేర్కొంది. గ్లోబల్‌ జీడీపీలో ఇది 2.3–4.8 శాతానికి సమానంగా ఉంటుందని వివరించింది. వర్ధమాన ఆసియా దేశాలు కరోనా వైరస్‌ వల్ల అత్యధికంగా నష్టపోనున్నాయని తెలిపింది. దీంతో ఇప్పటికే ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

ఈక్విటీ మార్కెట్లలోని బేరిష్ ట్రెండ్ అటు బంగారానికి మాత్రం బుల్లిష్ ధోరణిని పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం అంత తొందరగా బంగారం వైపు మదుపరులు తమ పెట్టుబడులు తరలించకపోయినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం మరింత ధర పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మన దేశీయ బులియన్ మార్కెట్లపై దీని ప్రభావం ప్రత్యక్షంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1600 డాలర్లు తాకింది. గత సంవత్సరం డిసెంబర్ 16న ఔన్సు బంగారం ధర 1472 డాలర్లు ఉండగా. ప్రస్తుతం 1600 డాలర్లకు ఎగిసింది. అంటే ఏకంగా 130 డాలర్లు పెరిగింది. ఫలితంగా అటు దేశీయంగా సైతం బంగారం ధరలు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు ఇప్పటికే దేశీయంగా 24 కేరట్ల ధర 44 వేల పై చిలుకే పలుకుతుండగా, ఔన్సు బంగారం 2,000 డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూప్‌ అంచనా వేసింది. మరోవైపు కరోనా ఎఫెక్ట్ నుంచి బయట పడిన తర్వాత అభివృద్ధి చెందిన దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సహా పలు యూరప్ దేశాలు తమ పసిడి నిలువలను ప్రపంచ మార్కెట్ లో అమ్మకానికి పెట్టే అవకాశం ఉందని, అప్పుడు బంగారం ధరలు పతనమయ్యే చాన్స్ ఉందనే విశ్లేషణలు కూడా ఏర్పడుతున్నాయి. అయితే దీనికి ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది.
First published: April 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading