హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Jewellery: బంగారు ఆభరణాలపై ఈ చార్జీలు పెరిగాయి! కొత్త రేట్లు ఇలా

Gold Jewellery: బంగారు ఆభరణాలపై ఈ చార్జీలు పెరిగాయి! కొత్త రేట్లు ఇలా

బంగారు ఆభరణాలు.. ఈ చార్జీలు పెంపు! కొత్త రేట్లు ఇలా

బంగారు ఆభరణాలు.. ఈ చార్జీలు పెంపు! కొత్త రేట్లు ఇలా

Gold Charges | మీ ఇంట్లో ఉన్న పాత బంగారం ఉందా? దీనికి గోల్డ్ హాల్ మార్కింగ్ చేయించాలని చూస్తున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. గోల్డ్ హాల్ మార్కింగ్ చార్జీలు పెరిగాయి. కొత్త చార్జీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Gold price| బంగారు ఆభరణాలు కొనే వారికి గోల్డ్ (Gold) హాల్ మార్కింగ్ గురించి తెలిసే ఉంటుంది. 2022 జూన్ 1 నుంచి దేశంలో రెండో దశ గోల్డ్ హాల్ (Gold Hallmark) మార్కింగ్ తప్పనిసరి అయ్యింది. దీంతో దేశంలో కేవలం 14, 18, 20, 22, 23, 24 క్యారెట్లలోని బంగారాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం.. చూస్తే బంగారు ఆభరణాలకు గోల్డ్ హాల్ మార్కింగ్ చార్జీలు అనేవి ఉంటాయి. సిల్వర్ జువెలరీకి కూడా ఇదే వర్తిస్తుంది.

  అయితే ఈ గోల్డ్ హాల్ మార్కింగ్ చార్జీలు పెరిగాయి. బంగారు నగల విషయానికి వస్తే.. ఇది వరకు గోల్డ్ హాల్ మార్కింగ్ ఫీజు అనేది రూ. 35గా ఉండేది. ఇప్పుడు రూ. 45 చెల్లించుకోవాలి. అలాగే సిల్వర్ జువెలరీ మీద ఈ చార్జీలను గమనిస్తే.. రూ. 25 నుంచి రూ. 35కు పెరిగాయి. ఒక్కో ఐటమ్స్‌కు ఈ చార్జీలు వర్తిస్తాయి. అంటే రెండు గోల్డ్, సిల్వర్ ఐటమ్స్ ఉంటే.. అప్పుడు రూ.90, రూ.70 చొప్పున చార్జీలు చెల్లించుకోవాలి.

  ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ సేవలు బంద్!

  గోల్డ్ హాల్ మార్కింగ్ చార్జీలను ఐటమ్స్ చొప్పున లెక్కిస్తారు. అంతేకానీ బరువు పరంగా విధించరు. బీఐఎస్ గోల్డ్ హాల్ మార్కింగ్ చార్జీలను పెంచడం 2018 నుంచి ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2018 నుంచే గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్‌ను ప్రవేశపెట్టారు. కేంద్రం 2019 నవంబర్‌లో కీలక ప్రకటన చేసింది. 2021 జనవరి 15 నుంచి గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్ అమలులోకి వస్తాయని తెలిపింది.

  బంగారం, వెండి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా పడిపోయిన ధరలు!

  అయితే తర్వాత ఈ గడువును నాలుగు నెలలు వెనక్కి జరిపారు. కోవిడ్ 19 కారణంగా గడువు పొడిగించాలని జువెలర్స్ కేంద్రాన్ని కోరడం ఇందుకు కారణం. తర్వాత జూన్ 1 నుంచి ఈ రూల్స్‌ను అమలులోకి తెచ్చారు. దీంతో కస్టమర్లు కొనుగోలు చేసే బంగారు ఆభరణాలకు కచ్చితంగా హాల్ మార్కింగ్ ఉండాలి. లేదంటే జువెలరీ సంస్థలకు భారీ జరిమానా పడుతుంది. జైలు శిక్ష కూడా పడొచ్చు. అయితే ఇక్కడ కస్టమర్లు వారి వద్ద ఉన్న బంగారాన్ని జువెలరీ సంస్థలకు విక్రయిస్తే.. వాటికి హాల్ మార్కింగ్ లేకున్నా సరిపోతుంది. కాగా గోల్డ్ జువెలరీ హాల్ మార్కింగ్ చేస్తే అప్పుడు ఆభరణాలపై బీఐఎస్ లోగో, ఫిట్‌నెస్ గ్రేడ్, ఆరు డిజిట్స్ అల్పాన్యూమరిక్ కోడ్ వంటివి ఉంటాయి. అందువల్ల మీరు బంగారం కొనే ప్రతి సారి ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. గోల్డ్ హాల్ మార్క్ ఉన్న బంగారాన్నే కొనుగోలు చేయాలి. లేదంటే మోసపోవాల్సి వస్తుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Gold jewellery, Gold price, Gold Price Today, Gold rate, Gold Rate Today

  ఉత్తమ కథలు