Gold: బంగారం కొనాలని ప్లాన్ ఉందా...అయితే ఇఫ్పుడే కొనేయండి...ఎందుకో తెలిస్తే షాక్ తింటారు...

Gold: బంగారం కొనాలని ప్లాన్ ఉందా...అయితే ఇఫ్పుడే కొనేయండి...ఎందుకో తెలిస్తే షాక్ తింటారు...

ప్రతీకాత్మకచిత్రం

అయితే ప్రస్తుతం మాత్రం బంగారం ధరలు రూ.44 వేల నుంచి రూ.45 వేల మధ్యలో ఊగిసలాడుతున్నాయి. అంటే రానున్న అతి సమీ భవిష్యత్తులో బంగారం ధర మరో పది వేలు పెరిగే చాన్స్ ఉందని బులియన్ పండితులు విశ్లేషిస్తున్నారు.

  • Share this:
    బంగారం ధర గత సంవత్సరంతో పోల్చితే భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు గత ఏడాది గరిష్టంగా తులం 58 వేల వరకూ తాకింది. అక్కడి నుంచి పతనం అవుతూ ప్రస్తతుం రూ.45 వేలకు దిగువకు చేరుకున్నాయి. అయితే బంగారం ధరలు మరోసారి పెరగడం ప్రారంభమైంది. అయితే ఇలాంటి సమయంలో మీరు బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తే మాత్రం, ప్రస్తుత పరస్థితుల్లో ఫిజికల్ గోల్డ్ విషయంలో అయితే కొంత మీరు అనుకున్న మొత్తంలో కొనుగోలు చేసుకుంటేనే మంచిది, ఎందుకంటే ముందు ముందు బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఓ వైపు కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ లాక్ డౌన్ భయాలు మరోసారి వెంటాడుతున్నాయి. ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టు అయిన ముంబై, మహారాష్ట్రల్లో కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా స్ప్రెడ్ అవుతోంది. దీంతో బంగారం ధరలు మరోసారి పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధర అటు అంతర్జాతీయంగా ఔన్స్‌కు 2000 డాలర్ల స్థాయికి చేరొచ్చనే నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అది కూడా రానున్న 4 నెలల్లోనే ఈ స్థాయికి చేరుకునే వీలుంది. దీంతో బంగారం మరోసారి తులం రూ.55 వేలకు చేరుకోవచ్చనే భయాలు అందుకున్నాయి.

    అయితే ప్రస్తుతం మాత్రం బంగారం ధరలు రూ.44 వేల నుంచి రూ.45 వేల మధ్యలో ఊగిసలాడుతున్నాయి. అంటే రానున్న అతి సమీ భవిష్యత్తులో బంగారం ధర మరో పది వేలు పెరిగే చాన్స్ ఉందని బులియన్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలని వాయిదా వేస్తూ వస్తున్నవారు. వెంటనే కొనుగోలు చేసుకుంటే బంగారం ధర పెరుగుదల నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది. అటు వడ్డీ రేట్లు తగ్గిపోవడంతో పాటు, డిమాండ్ పెరగడం, ద్రవ్యోల్బణం పెరుగుదల కూడా బంగారం ధరలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి.

    దీంతో బంగారం తక్కువ ధర ఉన్నప్పుడే కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇకబంగారం ధర ఈ వారంలో ఏకంగా రూ.1,200 పెరిగింది. దీంతో బంగారం ధరలు మరోసారి అరలక్ష వైపుకు వెళ్లేందుకు పెద్ద సమయం పట్టకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.

    గమనిక: బంగారం
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు