గోల్డ్ స్కీముల్లో డబ్బులు పెట్టారా... కొత్త చట్టం వస్తోంది... అందులో ఏముందంటే...

Gold Scheme New Act : ఇకపై రకరకాల ఆఫర్లు కుదరవు. ఓ గోల్డ్ స్కీమైనా ఏడాది లోపే క్లోజ్ అవ్వాలి. అందులో ఎలాంటి ఫ్రీ స్కీమ్‌నూ ప్రకటించకూడదని చట్టం చెబుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: February 25, 2019, 9:56 AM IST
గోల్డ్ స్కీముల్లో డబ్బులు పెట్టారా... కొత్త చట్టం వస్తోంది... అందులో ఏముందంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మధ్య తరగతి వారు తమ సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం, భవిష్యత్తు కోసం దాచి పెడతారు. ఇందుకోసం బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెట్టే వారు కొందరైతే, బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు మరికొందరు. ఇటీవల గోల్డ్ స్కీంలు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. జ్యువెలరీ షాపులు... తొలి వాయిదా తాము చెల్లిస్తామనో, అదనపు ఖర్చులు ఉండవనో ఏదో ఒకరకంగా ఆకర్షిస్తూ... గోల్డ్ స్కీముల్లో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఇది కొంతవరకూ మంచిదే. చేతిలో బంగారం ఉంటే... సడెన్‌గా మనీ అవసరమైనప్పుడు... దాన్ని డిపాజిట్ చేసి... డబ్బు తీసుకోవచ్చు. జ్యువెలరీ షాపులకు కూడా ఇది కలిసొస్తోంది. వినియోగదారులతో కంటిన్యూగా బిజినెస్ నడుస్తోంది.

gold schemes, gold mining, deposits, gold panning, gold bond scheme, gold schemes, gold monetisation scheme, gold coin, gold schemes modi, gold scheme india, gold monetisation, gold bond schemes, india gold schemes, gold scheme news, new gold scheme, gold scheme 2015, modi gold scheme, gold scheme launch, what is gold scheme, gold scheme by modi, gold scheme online, gold monetisation schemes, modi govt gold scheme, gold scheme launched, గోల్డ్ స్కీమ్, గోల్డ్ స్కీములు, బంగారం పెట్టుబడులు, బంగారం చట్టం
ప్రతీకాత్మక చిత్రం

కంగారు పెట్టిస్తున్న కొత్త చట్టం : కేంద్ర ప్రభుత్వం గోల్డ్ స్కీములపై అన్‌రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ యాక్ట్ 2019 తెచ్చింది. దాని ప్రకారం బంగారం వ్యాపారులు... గోల్డ్ స్కీముల్లో ఏడాదికి మించి డబ్బులు వసూలు చేయకూడదు. సరిగ్గా 365 రోజులు అవ్వగానే కస్టమర్లకు నగలను ఇచ్చేయాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా చేసినా నేరం కిందకే వస్తుంది. ఈ చట్టం ప్రకారం జ్యువెలరీ షాపుల యాజమాన్యాలు ఒక నెల ఉచిత వాయిదా, ఇతరత్రా ఫ్రీ ఆఫర్లు ఇవ్వడానికి వీల్లేదు. అలాంటి వాటిని నేరం కిందే పరిగణిస్తోంది ఈ చట్టం. కస్టమర్లు భవిష్యత్తులో కొనబోయే వస్తువుకు ముందస్తుగా డబ్బు చెల్లిస్తున్నారని వ్యాపారులు చెప్పినా... అందుకు పక్కా ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.

gold schemes, gold mining, deposits, gold panning, gold bond scheme, gold schemes, gold monetisation scheme, gold coin, gold schemes modi, gold scheme india, gold monetisation, gold bond schemes, india gold schemes, gold scheme news, new gold scheme, gold scheme 2015, modi gold scheme, gold scheme launch, what is gold scheme, gold scheme by modi, gold scheme online, gold monetisation schemes, modi govt gold scheme, gold scheme launched, గోల్డ్ స్కీమ్, గోల్డ్ స్కీములు, బంగారం పెట్టుబడులు, బంగారం చట్టం
ప్రతీకాత్మక చిత్రం
ఇకపై ఇలా చెయ్యాలి : ఎవరైనా గోల్డ్ స్కీంలో చేరితే, 12 నెలలు మాత్రమే స్కీం ఉండాలి. 12 నెలలూ కస్టమర్లే డబ్బు చెల్లించాలి. ఈ విషయంలో జ్యువెలరీ సంస్థ ఒక నెల వాయిదా ఫ్రీ వంటి ఎలాంటి ఆఫర్లూ ప్రకటించకూడదు. 12వ నెలలో 365 రోజులు ముగియగానే... బంగారాన్ని వెంటనే కస్టమర్లకు ఇచ్చేయాలి. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా నేరంగానే పరిగణిస్తుంది కొత్త చట్టం.

ఇవి కూడా చదవండి :

స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌షాట్ తీసుకోవాలా... 6 మార్గాలున్నాయి... ఇలా చెయ్యండి

ఏటీఎం పిన్‌ మర్చిపోయారా... రీసెట్ చేసుకోవచ్చు... ఇలా చెయ్యండి...

తల లేకుండా 18 నెలలు బతికిన కోడి... ఎలా సాధ్యమైందంటే...

First published: February 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>