GOLD COIN ATM TANISHQ LAUNCHES GOLD COIN ATMS SELLS OVER RS 25 LAKH COINS FULL DETAILS HERE GH VB
Gold Coin ATM: గోల్డ్ కాయిన్ ATMలను ప్రారంభించిన తనిష్క్.. ఎన్ని నాణేలు విక్రయించారో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
ఇప్పుడు బంగారు నాణేల(Gold Coins)ను కొనుగోలు చేయడం ఏటీఎం(ATM) నుంచి డబ్బును విత్‌డ్రా చేసినంత సులభం. టాటా గ్రూప్‌కు చెందిన ఆభరణాల అనుబంధ సంస్థ తనిష్క్ ఇటీవల తన స్టోర్లలో గోల్డ్ డిస్పెన్సింగ్ (బంగారం అందజేసే యంత్రాలు) మెషీన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పుడు బంగారు నాణేల(Gold Coins)ను కొనుగోలు చేయడం ఏటీఎం(ATM) నుంచి డబ్బును విత్‌డ్రా చేసినంత సులభం. టాటా గ్రూప్‌కు చెందిన ఆభరణాల అనుబంధ సంస్థ తనిష్క్ ఇటీవల తన స్టోర్లలో గోల్డ్ డిస్పెన్సింగ్ (బంగారం అందజేసే యంత్రాలు) మెషీన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ వారం ప్రారంభంలో అక్షయ తృతీయ నాడు దేశవ్యాప్తంగా ఉన్న 21 ఫ్లాగ్షిప్ స్టోర్లలో తనిష్క్ సంస్థ గోల్డ్ డిస్పెన్సింగ్ మెషీన్ల(Gold Dispensing Machine)ను ప్రారంభించింది. ఒకటి, రెండు గ్రాముల బంగారు నాణేలను అందజేసే యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓ వార్తా సంస్థలో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఈ గోల్డ్ కాయిన్ ATMల ద్వారా తనిష్క్ రూ.25 లక్షలకు పైగా విలువైన బంగారు నాణేలను విక్రయించింది.
సాధారణంగానే ఇండియాలో ప్రజలు బంగారం ఎక్కువగా ఇష్టపడతారు. అదేవిధంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ఆ రోజు ఎక్కువ మంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సాంప్రదాయ భారతీయ గృహాలలో, బంగారం ఇప్పటికీ ఉత్తమమైన , సురక్షితమైన పెట్టుబడిగా ఉండటం గమనార్హం. ఆభరణాలు, నాణేలు రూపంలో కొనడం పైనే మొగ్గు చూపుతారు. అయితే ఈ అక్షయ తృతీయ సమయంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు గోల్డ్ బాండ్లు(Gold Bonds), గోల్డ్ ఈటీఎఫ్‌లు, లేదా డిజిటల్ బంగారం(Digital Gold). భౌతిక బంగారం, గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా డిజిటల్ బంగారంపై వేర్వేరుగా పన్ను ఉంటుందని గమనించాలి.
అందుకే అక్షయ తృతీయ పవిత్రమైన రోజును పురస్కరించుకుని అనేక మంది వినియోగదారులు బంగారాన్ని కొనుగోలు చేసేలా ఈ యంత్రాలను తీసుకొచ్చామని టైటాన్ జ్యువెలరీ విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజోయ్ చావ్లా చెప్పారు. బంగారు నాణేలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పొడవైన వరుసలలో వేచి ఉండవలసి రావడంతో వారు నిరాశకు గురవుతారని, ఈ సమస్యను పరిష్కరించడానికి వినూత్నంగా ఆలోచించి యంత్రాలను సిద్ధం చేశామని అజోయ్ చావ్లా వార్తాపత్రికతో వివరించారు. యంత్రాల సేవలతో కస్టమర్లు సంతోషంగా ఉన్నందుకు సంతోషిస్తున్నామని, ఇది చాలా మంచి పురోగతి అని విశ్వసిస్తున్నామని, ఈ తరహా యంత్రాల సేవలను కొంత కాల వ్యవధిలో మా అన్ని స్టోర్లలోనూ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామని చెప్పారు.
తనిష్క్ గోల్డ్ కాయిన్ ఏటీఎం ఇతర డిస్పెన్సింగ్ మెషిన్ లాగా పనిచేస్తుంది. వినియోగదారులు కోరుకున్న గ్రాముల బంగారాన్ని ఎంచుకున్న తర్వాత, యంత్రం చెల్లించాల్సిన మొత్తాన్ని స్క్రీన్‌పై చూపుతుంది. పేమెంట్ చేసిన తర్వాత, అది ప్యాక్ చేసిన బంగారు నాణేలను బయటకు పంపుతుంది. బంగారు నాణేలను కొనడం బంగారంలో పెట్టుబడి పెట్టడానికి మీకు ఇష్టమైన మార్గం కాకపోతే, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (గోల్డ్ ఈటీఎఫ్), గోల్డ్ సేవింగ్స్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.