Home /News /business /

Gold Demand: వచ్చే ఏడాది భారతీయులు బంగారం ఎక్కువగా కొంటారట.. కారణం ఇదే

Gold Demand: వచ్చే ఏడాది భారతీయులు బంగారం ఎక్కువగా కొంటారట.. కారణం ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gold demand in india: ప్రజల జీతాలు తగ్గడంతో పాటు పొదుపు రేటు తగ్గడం వల్ల ఈ సంవత్సరం భారతదేశంలో ఊహించిన దాని కంటే బంగారం డిమాండ్ (Gold demand) మరింత తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ఓ నివేదికలో తెలిపింది. ఈ ఏడాది బంగారానికి డిమాండ్ తగ్గినప్పటికీ.. వచ్చే ఏడాది డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని డబ్ల్యుజీసీ నివేదిక పేర్కొంది.

ఇంకా చదవండి ...
కరోనా మహమ్మారి (Coronavirus) విజృంభించిన తర్వాత చాలా మంది ప్రజల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ఉపాధి కోల్పోవడం, తక్కువ జీతాలు అందుకోవడం వంటి పరిస్థితుల్లో ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపలేదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు బంగారం కొనుగోళ్లకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు. అందుకే ఈ ఏడాదిలో ఊహించినదానికంటే బంగారాని (Gold)కి తక్కువ డిమాండ్ ఏర్పడింది. ప్రజల జీతాలు తగ్గడంతో పాటు పొదుపు రేటు తగ్గడం వల్ల ఈ సంవత్సరం భారతదేశంలో ఊహించిన దాని కంటే బంగారం డిమాండ్ మరింత తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ఓ నివేదికలో తెలిపింది. ఈ ఏడాది బంగారానికి డిమాండ్ తగ్గినప్పటికీ.. వచ్చే ఏడాది డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని డబ్ల్యుజీసీ నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం దిగుమతులు బలంగా ఉన్నాయని.. రిటైల్ డిమాండ్ (Retail demand) పెరుగుతుందని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలు (Covid restrictions)  క్రమంగా ఎత్తివేస్తుండటంతో పాటు పండుగ సీజన్‌ రావడంతో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు పెరుగుతాయని గోల్డ్ వ్యాపారులు కూడా ఆశిస్తున్నారు.

IRCTC Tirupati Tour: శ్రీవారి ప్రత్యేక దర్శనంతో హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ

గోల్డ్ ఇండస్ట్రీకి సంబంధించిన మార్కెట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డబ్ల్యుజీసీ.. ఇండియన్ గోల్డ్ మార్కెట్‌(Indian Gold Market)కి సంబంధించి కచ్చితత్వంతో సమగ్ర నివేదికలను అందిస్తుంది. ప్రస్తుతం ఇది దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఓ నివేదిక అందించింది. ఈ నివేదిక ప్రకారం ఆర్థిక వృద్ధి కారణంగా 2022లో బంగారం డిమాండ్ భారీగా పెరుగుతుంది. పండుగ కాలంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి రిటైలర్లు ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశం ఉంది కాబట్టి.. 2022లో గోల్డ్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. అయితే భవిష్యత్తులో కరోనావైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగితే బంగారం డిమాండ్ తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

Restaurant on Wheels: రైలు బోగీలో రెస్టారెంట్... ఎక్కడో తెలుసా?

భారతదేశంలో పెరుగుతున్న ఆదాయం బంగారం డిమాండ్‌ పెరిగేలా చేస్తుందని.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ, విలువైన మెటల్ అమ్మకాలు పెరుగుతాయని డబ్ల్యుజీసీని పేర్కొంది. 1990 కాలం నుంచి మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరిగిందని.. గృహ ఆదాయాలు పెరిగాయని వివరించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో తలసరి నికర ఆదాయం సంవత్సరానికి రూ.7,000 నుంచి రూ.1,34,186 కి పెరిగిందని తెలియజేసింది. ఈ స్థాయిలో ఆదాయం పెరిగినప్పటికీ గతంలో చేసినంతగా ఇప్పుడు అధికంగా పొదుపు చేయడం లేదని.. ఫలితంగా బంగారానికి కేటాయించే పొదుపు తగ్గొచ్చని అభిప్రాయపడింది.

PF Rules: పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

దీర్ఘకాలంలో ఆదాయం అనేది గోల్డ్ డిమాండ్‌లో కీలకమైన పాత్ర పోషిస్తుందని కానీ ఇది ఇతర అంశాలపై కూడా ఆధారపడుతుందని నివేదిక వివరించింది. పాలసీ మేకర్స్ దిగుమతుల ద్వారా మాత్రమే బంగారం డిమాండ్‌ని అంచనా వేస్తున్నందున.. పాలసీ చర్యలకు మద్దతు కొరవడిందని పేర్కొంది. పారదర్శకతను మెరుగుపరిచేందుకు పరిశ్రమలు సమన్వయంతో ప్రయత్నాలు చేయడం లేదని నివేదిక పేర్కొంది. వినియోగదారులలో నమ్మకంతో పాటు అవగాహన పెంచడం ద్వారా ఇండియా గోల్డ్ డిమాండ్ పెంచవచ్చని సూచించింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Business, Gold, Gold price, Gold rate

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు