• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOLD BULLS ROAR AS VIRUS CONTINUES TO SPREAD BUT CAUTION WARRANTED MK

Gold Rate: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే షాకే...తులం బంగారం అర లక్ష పై మాటే...

Gold Rate: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే షాకే...తులం బంగారం అర లక్ష పై మాటే...

ప్రతీకాత్మక చిత్రం

Gold Rate: హైదరాబాద్ మార్కెట్లో 24 కేరట్ల తులం బంగారం విలువ రూ.43719 నమోదు కాగా, 22 కేరట్ల బంగారం తులం విలువ రూ.40640గా నమోదయ్యింది.

  • Share this:
    చైనాను దాటి కరోనావైరస్ అటు దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్ లకు వ్యాపిచడంతో, మదుపుదారులు తమ సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మరలుతున్నారు. ఫలితంగా బంగారం 7 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకోగా, యుఎస్ బాండ్ యీల్డ్ 10 సంవత్సరాల రికార్డు స్థాయికి పడిపోయింది. మరోవైపు, యుఎస్ డో జోన్స్ సూచీ సైతం ఇటీవలి 8 శాతానికి పైగా పడిపోయింది, ఆర్థికంగా సున్నిత పెట్టుబడి సాధనాలైన ముడి చమురు ఒక సంవత్సరం కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే బంగారం దేశీయంగా మాత్రం కొత్త రికార్డులను నమోదు చేసింది. హైదరాబాద్ మార్కెట్లో 24 కేరట్ల తులం బంగారం విలువ రూ.43719 నమోదు కాగా, 22 కేరట్ల బంగారం తులం విలువ రూ.40640గా నమోదయ్యింది.

    అయితే చైనా బయట పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాక బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్ల పతనానికి కరోనా మహమ్మారి ఆజ్యం పోసింది. దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, బ్రెజిల్ లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తితో మార్కెట్ లో ఆందోళనలు పెరిగాయి. దీంతో మదుపరులు తమ సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు కదిలేందుకు కారణమవుతోంది. సెంట్రల్ బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలకు తోడ్పడటానికి ద్రవ్య విధానాన్ని కాస్త వదులుగా చేయవచ్చనే అంచనాలు సైతం బంగారం లాభపడేందుకు దోహదపడుతోంది.

    వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో పాటు చికిత్స అందుబాటులో లేకపోవడం గోల్డ్ మార్కెట్ సెంటిమెంట్ బలం పెంచింద. వచ్చే ఆరు నుండి పన్నెండు నెలల ఉల్లాసభరితమైన ధరల అంచనాల నుండి కూడా ఇది స్పష్టమవుతుంది. ఔన్స్ బంగారం విలువ 1,700 డాలర్లను మున్ముందు 1,780-1,800 డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రపంచ డిమాండ్‌లో భారత్‌, చైనా వాటా 50 శాతానికి మించి ఉంది. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం, అధిక ధర మరియు నెమ్మదిగా వృద్ధి చెందడం వలన చైనా వినియోగదారుల డిమాండ్ 2019 లో 15 శాతం పడిపోయింది. వైరస్ వ్యాప్తి రూపంలో దేశం ఇప్పుడు కొత్త సవాలును ఎదుర్కొంటోంది. గత ఏడాది భారత్ లో సైతం డిమాండ్ 9 శాతం పడిపోయింది.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు