హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold: బంగారం కొన్న వారి పంట పండింది.. డబ్బుల వర్షం!

Gold: బంగారం కొన్న వారి పంట పండింది.. డబ్బుల వర్షం!

బంగారంతో కాసుల వర్షం.. కొన్న వారి పంట పండింది!

బంగారంతో కాసుల వర్షం.. కొన్న వారి పంట పండింది!

Gold Bonds | మీరు గోల్డ్ బాండ్లు (Gold Bond Scheme) కొనుగోలు చేశారా? అయితే శుభవార్త. ఎందుకని అనుకుంటున్నారా? బంగారం ధర పెరుగుతూ వచ్చింది. అందువల్ల 2016-17 సిరీస్ 4వ విడతలో గోల్డ్ బాండ్లు కొన్న వారికి ఇప్పుడు అదిరిపోయే రాబడి వచ్చింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Gold Price | బంగారం అంటే అందరికీ మక్కువ ఎక్కువే. చాలా మంది పసిడి ప్రేమికులు ఉంటారు. బంగారం  (Gold)ఎలా కొన్నా కూడా లాభం పొందొచ్చు. ఎందుకని అనుకుంటున్నారా? చాలా మంది జువెలరీ (Gold Jewellery) రూపంలో బంగారం కొంటుంటారు. డబ్బుతో అత్యవసరం వచ్చినప్పుడు దీన్ని బ్యాంకులో తనఖా పెట్టి గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు. లేదంటే ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మాయికి పెట్టి పెళ్లి చేస్తుంటారు. ఇలా బంగారం ఇంట్లో ఉంటే ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు.

  అయితే ఇంకొంత మంది నేరుగా జువెలరీ రూపంలో కాకుండా బాండ్ల రూపంలో బంగారం కొంటూ ఉంటారు. ఇలాంటి వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. ఎందుకని అనుకుంటున్నారా? అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే. 2016-17 సిరీస్ 4వ విడత బంగారం బాండ్లు కొన్న వారికి కాసుల వర్షం కురిసింది. ఎందుకంటే ఇప్పుడు ఈ బంగారం బాండ్ల ధర గ్రాముకు రూ. 5077గా ఉంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ రేటు నిర్ణయించింది. ఈ బంగారు బాండ్ల ప్రిమెచ్యూర్ రిడంప్షన్ తేదీ సెప్టెంబర్ 17న ఉంది. అంటే ఈ తేదీ తర్వాత బంగారు బాండ్లను విక్రయించి డబ్బులు పొందొచ్చు.

  లక్ష రూపాయల టీవీని రూ.30 వేల కన్నా తక్కువకే కొనండి.. ఫ్లిప్‌కార్ట్ మైండ్‌బ్లోయింగ్ ఆఫర్!

  బంగారు బాండ్ల ధర 2016-17 సిరీస్ 4 వ విడతలో గ్రాముకు రూ. 2893గా ఉంది. అంటే అప్పటికీ ఇప్పటికీ బంగారం ధర భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్టర్లు ప్రిమెచ్యూరిటీ ఆప్షన్ కింద బంగారు బాండ్లను విక్రయిస్తే.. వీరికి 75 శాతానికి పైగా లాభం వస్తుందని చెప్పుకోవచ్చు.

  స్మార్ట్‌‌టీవీపై రూ.19 వేల డిస్కౌంట్.. రూ.28 వేల టీవీ రూ.8,500కే కొనేయండి

  గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రిమెచ్యూర్ విత్‌డ్రా రూల్స్ ప్రకారం చూస్తే.. గోల్డ్ బాండ్ మెచ్యూరిటీ కాలం 8 ఏళ్లు. అయితే ఐదేళ్ల దాటిన తర్వాత ప్రిమెచ్యూర్ ఆప్షన్ కింద బాండ్లను విక్రయించొచ్చు. ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయెల్ ఆప్షన్ ఎంచుకుంటే.. ఇన్వెస్టర్లు దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి సంప్రదిస్తే సరిపోతుంది. లేదంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫీస్‌లు, పోస్టాఫీస్‌లకు వెళ్లి కూడా బాండ్లను రెడీమ్ చేసుకోవచ్చు. గోల్డ్ బాండ్లను ఎక్కడైతే కొన్నారో.. అక్కడికే వెళ్లి సంప్రదించాలి. డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చి చేరాతాయి.

  ఇకపోతే గోల్డ్ బాండ్లలో డబ్బులు పెడితే వార్షికంగా 2.5 శాతం వడ్డీ వస్తుంది. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులు జమ అవుతూ వస్తాయి. మెచ్యూరిటీ సమయంలో ఒకసారి లేదంటే ఎప్పటి వడ్డీ డబ్బులను అప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. గోల్డ్ బాండ్ల మీద పొందిన వడ్డీపై ట్యాక్స్ పడుతుంది. మీ పన్ను శ్లాబ్ ప్రాతిపదికన ట్యాక్స్ చెల్లించాలి. గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ సమయంలో పొందిన క్యాపిటల్ గెయిన్స్‌పై ట్యాక్స్ ఉండదు. అయితే ప్రిమెచ్యూర్ విత్‌డ్రా ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం దీనిపై కూడా ట్యాక్స్ పడుతుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Gold, Gold jewellery, Gold Price Today, Gold Rate Today, Sovereign Gold Bond Scheme

  ఉత్తమ కథలు