కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ మార్కెట్‌లన్నీ కుప్పకూలినప్పటికీ బంగారం ధర పడిపోయింది. అయితే ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడిగా భావించే బంగారం ధరలు కూడా దిగిరావడం ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం ఒక్కరోజే 3 శాతంపైన బంగారం ధర పడిపోయింది. అమెరికా మార్కెట్‌లో 2008లో ఒక వారంలో ఆయిల్ ధరలు పడిపోయినట్లుగా ప్రస్తుతం పసిడి ధరలు తగ్గుతున్నాయి. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో మార్కెట్‌లో ఔన్స్ బంగారం 57.50 (3.5%)డాలర్లు పడిపోయి 1,585 డాలర్లకు చేరి 1,600 డాలర్లకు దిగువకు వచ్చింది. ఇదిలా ఉంటే ఇన్వెస్టర్లంతా రక్షణాత్మక పెట్టబడిగా భావించే బంగారం గత నెలలో వైరస్ విజృంభించడంతో గత వారంలో ఒక దశలో ఏడేళ్ల గరిష్టానికి పెరిగి 1,700 డాలర్ల సమీపానికి చేరింది. అయితే బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఈ ఏడాది 1,900 డాలర్ల రికార్డు ధర నమోదవుతుందని అంచనా వేశారు.
అయితే గోల్డ్ ఫ్యూచర్స్, బులియన్‌లో బంగారం ధర తగ్గడానికి మార్జిన్‌కాల్స్ పెరగడం, హెడ్జ్ ఫండ్స్ విక్రయాలు జరపడం కారణమని నిపుణులు చెబుతున్నారు. మార్జిన్ కాల్స్ వల్ల ఇన్వెస్టర్లు పూర్తి నగదు చెల్లించి కొనాలి లేదంటే ఆగిపోవాల్సి ఉంటుంది. అందువల్ల బంగారం ధర తగ్గిందని ఆర్‌బీసీ వెల్త్ మేనేజ్‌మెంట్ ఎండీ జార్జ్ జెరో తెలిపారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.