• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • GOLD AND SILVER RATES 8 JUNE 2021 GOLD AND SILVER PRICE DOWN DUE TO INTERNATIONAL MARKET AND STOCK MARKET HERE IS THE UPDATES NK

Gold Rate 8-6-2021: తగ్గిన బంగారం, వెండి ధరలు... ఇక రివర్స్ ట్రెండ్ మొదలైనట్లేనా?

తగ్గిన బంగారం, వెండి ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

Gold and Silver rate 8-6-2021: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. నిపుణులైతే... ఇంకా పెరుగుతాయనీ, లేదు తగ్గుతాయని భిన్న వాదనలు చేస్తున్నారు.

  • Share this:
    Gold and Silver price 8-6-2021: స్టాక్ మార్కెట్లు నిన్న దూసుకెళ్లాయి. దాదాపు నెల తర్వాత... ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చాయి. అందువల్ల చాలా మంది బంగారంపై పెట్టుబడులను వెనక్కి తీసుకొని... స్టాక్ మార్కెట్లో పెట్టారు. దాంతో... బంగారం, వెండి ధరలు తగ్గాయి. స్టాక్ మార్కెట్లు ఇలాగే దూసుకెళ్తే... బంగారం ధరలు మరింత తగ్గుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాకాకండా... మళ్లీ ఇండియాలో కరోనా పెరిగితే... అప్పుడు బంగారం ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు. కొందరు విశ్లేషకుల ప్రకారం... ఇక బంగారం ధరల్లో రివర్స్ గేర్ మొదలైనట్లే. ధరలు ఓ ఐదు వేల దాకా తగ్గవచ్చని అంటున్నారు. మరికొందరు విశ్లేషకులు మాత్రం... బంగారం కొనుగోళ్లు పెరిగి... ధరలు పెరుగుతాయని అంటున్నారు.

    రూ.50వేలు దగ్గర ఊగిసలాట:
    బంగారం ధరలు రూ.50వేల దగ్గర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడు (సోమవారం నాటికి)... రూ.45,800 ఉంది. 68 రోజుల్లో ధర రూ.4,700 పెరిగింది. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... ఇప్పుడు రూ.49,970 ఉంది. అంటే 68 రోజుల్లో ధర రూ.5,130 పెరిగింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

    Gold Price 8-6-2021:
    గత 10 రోజుల్లో బంగారం ధర 7 సార్లు పెరగగా... 2 సార్లు తగ్గింది. 1 సారి స్థిరంగా ఉంది. నిన్న ధర కొద్దిగా పెరిగింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,580 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.36,640 ఉంది. నిన్న తులం ధర రూ.88 పెరిగింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.45,800 ఉంది నిన్న ధర రూ.110 పెరిగింది.

    పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,997 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.39,976 ఉంది. నిన్న తులం ధర రూ.88 పెరిగింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.49,970 ఉంది. నిన్న ధర రూ.110 పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.

    Silver Price 8-6-2021:
    వెండి ధరలు గత 10 రోజుల్లో 5 సార్లు పెరగగా... 4 సార్లు తగ్గాయి. 1 సారి స్థిరంగా ఉన్నాయి. నిన్న తగ్గాయి. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.75.80 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.606.40 ఉంది. నిన్న ధర రూ.4 తగ్గింది. ఉంది. అదే 10 గ్రాములు కావాలంటే... ధర రూ.758 ఉంది. నిన్న ధర రూ.5 తగ్గింది. 100 గ్రాములు ధర రూ.7,580 ఉండగా... కేజీ వెండి ధర... రూ.75,800 ఉంది. గత 6 నెలల్లో వెండి ధర రూ.6,300 పెరిగింది.

    ఇది కూడా చదవండి: Horoscope 8-6-2021: రాశి ఫలాలు... ఈ రాశుల వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలతలు

    అంతర్జాతీయంగా ధర డౌన్:
    బంగారం ధరలు అంతర్జాతీయంగా కూడా తగ్గుతున్నాయి. రూపాయితో పోల్చితే... డాలర్ బలహీనపడుతోంది. అందువల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై ఎక్కువగా చెల్లించాల్సిన పనిలేదు. అందువల్ల బంగారం ధరలను తగ్గించడానికి వీలవ్వనుంది. ఈ ట్రెండ్ ఎలా కొనసాగుతుందన్నది ముందే అంచనా వెయ్యడం కష్టమే.
    Published by:Krishna Kumar N
    First published: