Gold Rate: అరలక్ష వైపు బంగారం పరుగులు...మరింత పెరిగిన పుత్తడి ధర...

ఇక రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. హైదరాబాద్ లో బంగారం ధర (24 కేరట్లు) 10 గ్రాములు రూ.40,330 వద్ద ట్రేడవుతుండగా, ముంబైలో రూ.40,310, చెన్నైలో రూ.40,330, విజయవాడలో రూ.40335, వైజాగ్ రూ.40330, నెల్లూరు రూ.40354 ధర పలుకుతోంది.

news18-telugu
Updated: September 3, 2019, 3:24 PM IST
Gold Rate: అరలక్ష వైపు బంగారం పరుగులు...మరింత పెరిగిన పుత్తడి ధర...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 3, 2019, 3:24 PM IST
బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రూపాయి విలువ భారీగా పతనం కావడంతో పసిడి ధరలు రికార్డులు చెరిపివేస్తూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యూఎస్-చైనా ట్రేడ్‌వార్ ఫలితంగా ఇప్పటికే బంగారం ధరలు 20 శాతం పెరిగిపోయాయి. దీంతో ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో, గోల్డ్ ఫ్యూచర్స్ రూ.39,109 వద్ద ట్రేడవ్వగా, వెండి ఫ్యూచర్స్ రూ.48682 వద్ద ట్రేడవుతూ ఆల్ టైం రికార్డులు చెరిపివేసింది. ఇక రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. హైదరాబాద్ లో బంగారం ధర (24 కేరట్లు) 10 గ్రాములు రూ.40,330 వద్ద ట్రేడవుతుండగా, ముంబైలో రూ.40,310, చెన్నైలో రూ.40,330, విజయవాడలో రూ.40335, వైజాగ్ రూ.40330, నెల్లూరు రూ.40354 ధర పలుకుతోంది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు చూస్తే ఔన్సు పరిమాణం ధర రూ.1532 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే డాలర్ మారకానికి ప్రతిగా రూపాయి విలువ రూ.72 వరకూ దిగజారింది. దీంతో బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. అలాగే అమెరికా-చైనా వాణిజ్యయుద్ధం భయాలతో బంగారం డిమాండ్ అమాంతం పెరిగింది. దీంతో న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1530-1550 డాలర్ల శ్రేణిలో ఊగిసలాడుతోంది.

పండగ సీజన్ సైతం బంగారం పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొనగోలుదారులకు పసిడి, వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వివాహ, ఇతర శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేసేవారు ధరల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నప్పటికీ బంగారం దుకాణాదారులు మాత్రం ఇకపై బంగారం ధర మరింత పెరుగుతుందే తప్ప తగ్గే చాన్స్ లేదని జోస్యం చెబుతున్నారు.

First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...