GOLD AND SILVER PRICES ROSE AGAIN TODAY WANT TO KNOW PRICE DETAILS OF GOLD AND SILVER IN YOUR AREA CLICK HERE PRV
Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధరలు.. తులం బంగారం ఎంతంటే..?
ప్రతీకాత్మక చిత్రం
గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో (gold prices) ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది.
గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో (gold prices) ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది. ఇక తాజాగా ఆదివారం (డిసెంబర్ 12)న 10 గ్రాముల బంగారం ధరపై (gold price) దాదాపు రూ.140 పెరిగింది. ఇక వెండి ధరల్లో (silver price) మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ (Hyderabad) లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర (Gold price) రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,250 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550 వద్ద ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై (Mumbai)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,790 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,790 వద్ద కొనసాగుతోంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,380ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉంది.
వెండి ధరలు పరిశీలిస్తే..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి (Silver price) ధర.61,200 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.61,200 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,100 ఉండగా, కోల్కతాలో రూ.61,200 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,200 ఉండగా, కేరళలో రూ.65,100 ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.65,100 ఉండగా, విజయవాడలో రూ.65,100 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధర (gold rates)ల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.