Gold Price Today: మూడు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర... తులం ఎంతంటే

Gold Rate Today | వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. గురువారం బంగారం, వెండి రేట్లు తగ్గాయి. తులం బంగారం, వెండి రేటు ఎంతో తెలుసుకోండి.

news18-telugu
Updated: March 5, 2020, 5:37 PM IST
Gold Price Today: మూడు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర... తులం ఎంతంటే
Gold Price Today: తగ్గిన బంగారం ధర... తులం ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వరుసగా మూడు రోజులుగా బంగారం ధరలు పెరగడం కొనుగోలుదారులను హడలెత్తించాయి. మూడు రోజుల్లో 10 గ్రాముల గోల్డ్‌పై సుమారు రూ.1,500 పెరగడం ఆందోళన రేకెత్తించింది. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.45,000 దాటడం చూసి గోల్డ్ రేట్ రూ.50,000 వైపు పరుగులు తీస్తుందన్న అంచనాలు కనిపించాయి. అయితే వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు గురువారం తగ్గడం కాస్త ఊరటను కలిగించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.170 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.45,140 కాగా 22 క్యారట్ బంగారం ధర రూ.41,360. న్యూ ఢిల్లీలోనూ బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల గోల్డ్‌పై రూ.157 తగ్గి రూ.44,250 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,640 డాలర్లు.

బంగారంతో పాటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ బంగారం ధర రూ.49,850. న్యూ ఢిల్లీలో కేజీ వెండిపై రూ.99 తగ్గడంతో రూ.47,517 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 17.17 డాలర్లు. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థలపై ఉండటంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడింది. రోజంతా రూపాయి విలువ హెచ్చుతగ్గులుగా ఉండటం, బంగారం, వెండికి డిమాండ్ తగ్గడం వల్లే రేట్లు తగ్గాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Online Gold: ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి

LIC Policy: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... సిప్ ప్లాన్‌తో లాభాలు ఇవే

Pension Scheme: ఈ స్కీమ్‌తో నెలకు రూ.19,000 పెన్షన్ పొందండి ఇలా
First published: March 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading