హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర జనవరి 8న రూ.42,860 ఉంది. వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇలా రికార్డులు సృష్టించాయి. కానీ జనవరి 13న 10 గ్రాముల బంగారం రూ.41,460 ధరకు పడిపోయింది. అంటే 6 రోజుల్లో ఏకంగా రూ.1,400 తగ్గింది. కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరలు ఇలా మెల్లమెల్లగా దిగొస్తున్నాయి. సోమవారం నాటి బంగారం ధరలు చూస్తే హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.600 తగ్గింది. రూ.42,060 నుంచి రూ.41,460 ధరకు దిగొచ్చింది బంగారం. ఇక 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,010. న్యూ ఢిల్లీలో బంగారం ధర రూ.236 తగ్గింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.40,432. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,550 డాలర్లు.
బంగారం మాత్రమే కాదు... వెండి ధరలు కూడా దిగొస్తున్నాయి. జనవరి 8న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.51,000 ఉంటే జనవరి 13న కిలో వెండి రూ.49,000 ధరకు దిగొచ్చింది. అంటే ఆరు రోజుల్లో రూ.2,000 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి ధర రూ.376 తగ్గి రూ.47,635 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 17.97 డాలర్లు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడం, రూపాయి బలపడటం లాంటి కారణాలతో బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడింది.
కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Gold: బంగారం 10% డిస్కౌంట్‌కే కొనొచ్చు ఇలా
Gold Loan: బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటున్నారా? వడ్డీ రేట్లు ఇవే
Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold jewellery, Gold ornmanets, Gold price down, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Silver rates