Gold price 29-5-2021: తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు... తాజా రేట్లు ఇవీ...

Gold price 29-5-2021: తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు... (ప్రతీకాత్మక చిత్రం)

Gold and Silver rate 29-5-2021: బంగారం, వెండి ధరలు ఊగిసలాడుతున్నాయి. ప్రధానంగా బంగారంపై పెట్టుబడులు స్టాక్ మార్కెట్లలోకి వెళ్తుండటంతో... బంగారం ధరలు తగ్గాయి. తాజా అప్‌డేట్స్ తెలుసుకుందాం.

  • Share this:
    Gold and Silver price 29-5-2021: బంగారం ధరలు బులియన్ మార్కెట్ల నిపుణుల అంచనాలకు అందట్లేదు. వారేమో పెరుగుతాయని చెబితే... ధరలు తగ్గాయి. ఐతే... ఈ తగ్గుదల అనేది స్వల్పకాలమే తప్ప దీర్ఘ కాలంలో చూస్తే... ధరలు పెరుగుతున్న విషయం అర్థం అవుతుంది అంటున్నారు. అదీ నిజమే... గత 58 రోజులుగా చూస్తే... బంగారం ధరలు దూసుకుపోతున్నట్లే. బంగారం ధర 4 నెలల గరిష్టానికి చేరింది. కొన్ని రోజులుగా బిట్‌కాయిన్ సహా ఇతర క్రిప్టో కరెన్సీలు, డాలర్ కరెన్సీ విలువ తగ్గుతోంది. దాంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా ధరలు రూ.50వేల మార్కును టచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మున్ముందు ఈ ధరలు ఇంకా పెరుగుతాయి అంటున్నారు నిపుణులు.

    Gold rate 29-5-2021:
    గత 10 రోజుల్లో బంగారం ధర 3 సార్లు పెరగగా... 5 సార్లు స్థిరంగా ఉంది. 2 సార్లు తగ్గింది. నిన్న ధర తగ్గింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 10 గ్రాములు రూ.45,700 ఉంది. నిన్న ధర రూ.200 తగ్గింది. తులం బంగారం ధర ప్రస్తుతం రూ.36,560 ఉంది. నిన్న తులం ధర రూ.160 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,570 ఉంది. అలాగే పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.49,860 ఉంది. నిన్న ధర రూ.240 తగ్గింది. తులం బంగారం ధర రూ.39,88 ఉంది. నిన్న తులం ధర రూ.192 తగ్గింది. ఒక్క గ్రాము ధర రూ.4,986 ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.

    Silver rate 29-5-2021:
    వెండి ధరలు గత పది రోజుల్లో 3 సార్లు పెరగగా... 5 సార్లు తగ్గాయి. 2సార్లు స్థిరంగా ఉన్నాయి. నిన్న కొద్దిగా పెరిగాయి. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.76,100 ఉంది. నిన్న ధర రూ.400 పెరిగింది. అలాగే... తులం (8 గ్రాములు) ధర రూ.608.80 ఉంది. నిన్న తులం ధర రూ.3.20 పెరిగింది. ఒక్క గ్రాము వెండి ధర రూ.76.10 ఉంది. 6 నెలల కిందట నవంబర్ 29న వెండి ధర కేజీ రూ.64,700 ఉంది. ఇప్పుడు రూ.76,100 ఉంది. అంటే 6 నెలల్లో వెండి ధర రూ.11,400 పెరిగింది.

    ఇది కూడా చదవండి: Horoscope 29-5-2021: ఈ రాశుల వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త

    స్టాక్ మార్కెట్లకు డిమాండ్:
    ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు తగ్గుతుంటే... మళ్లీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లవైపు చూస్తున్నారు. మొత్తం డబ్బును ఒకే చోట కాకుండా... బంగారంపై కొంత, స్టాక్ మార్కెట్లలో కొంత పెట్టుబడి పెడుతున్నారు. ఇలా చెయ్యమని ఇన్వెస్ట్‌మెంట్ ఎనలిస్టులు వారికి సలహా ఇస్తున్నారు. అందువల్ల స్టాక్ మార్కెట్లు మళ్లీ దూసుకెళ్తున్నాయి. అలాగే బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకూ 59 రోజుల్లో 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.4,600 పెరగగా... 24 క్యారెట్ల పెట్టుబడి బంగారం ధర రూ.5,060 పెరిగింది. ఐతే... మే 27 నుంచి కంటిన్యూగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అనుకునేవారు... జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అన్ని అంశాలూ లెక్కలోకి తీసుకోవడం మేలు.
    Published by:Krishna Kumar N
    First published: