Gold Price Today: బంగారం, వెండి ధరల్లో పెరుగుదల... నేటి ధరల వివరాలు

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో పెరుగుదల... నేటి ధరల వివరాలు

Gold and Silver Price Hike: అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరల వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలపై అంతర్జాతీయ అంశాల ప్రభావం ఎక్కువగా పడుతోంది. అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. గోల్డ్ పై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. స్థిరమైన పెట్టుబడి మార్గంగా... ఇన్వెస్టర్లు బంగారాన్ని చూస్తున్నారు. అందువల్ల గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే... అంతర్జాతీయంగా డాలర్ మారకపు విలువలో ఎక్కువగా మార్పులొస్తున్నాయి. అందువల్ల ఇన్వెస్టర్లు బంగారంపై నమ్మకం పెంచుకుంటున్నారు. ఈ క్రమంగా బంగారం ధర పెరుగుతోంది. మరి ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో మార్పులను తెలుసుకుందాం.

    నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.48,370 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ 22 క్యారెట్ల బంగారం రూ.120 పెరిగింది.

    24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.52,760 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.120 పెరిగింది.

    RBI Revamped Gold Deposit Scheme, RBI Gold Deposit Scheme, RBI Gold monetisation scheme, SBI R- GDS, SBI Gold Fixed Deposit, RBI Gold Fixed Deposit, Gold investment, Gold investment ideas, ఆర్‌బీఐ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఆర్‌బీఐ గోల్డ్ మానెటైజేషన్ స్కీమ్, గోల్డ్ ఫిక్స్‌డ్ డిపాజిట్, ఎస్‌బీఐ గోల్డ్ స్కీమ్
    Gold Price Today: బంగారం, వెండి ధరల్లో పెరుగుదల... నేటి ధరల వివరాలు


    బంగారంతోపాటూ... వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర నిన్న రూ.60,700 ఉండగా... ఇవాళ రూ.500 పెరిగి... కేజీ రూ.61,200కి చేరింది. పారిశ్రామిక సంస్థల నుంచి వెండికి డిమాండ్ పెరుగుతోంది.

    బంగారం వెండి ధరల పెరుగుదలకు కరోనా వైరస్ కూడా కారణమైంది. ఈ వైరస్ వ్యాప్తి మొదలయ్యాక... అంతర్జాతీయంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ పతనమయ్యాయి. డాలర్ విలువలో హెచ్చుతగ్గులు మొదలయ్యాయి. ఈ కారణంగా ఇన్వెస్టర్లు... బంగారంవైపు ఫోకస్ పెట్టారు. అందువల్ల బంగారానికి డిమాండ్ పెరిగింది. మొత్తంగా చూస్తే... కొన్నేళ్లుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: