Home /News /business /

GOLD AND SILVER PRICE ON 30 MAY 2021 CHECK TODAY GOLD AND SILVER RATE IN HYDERABAD SECUNDERABAD AND VARIOUS CITIES ACROSS INDIA NK

Gold price 30-5-2021: 59 రోజుల్లో 5,110 పెరిగిన బంగారం ధర... నేటి రేట్లు ఇవీ...

59 రోజుల్లో 5,110 పెరిగిన బంగారం ధర... నేటి రేట్లు ఇవీ... (ప్రతీకాత్మక చిత్రం)

59 రోజుల్లో 5,110 పెరిగిన బంగారం ధర... నేటి రేట్లు ఇవీ... (ప్రతీకాత్మక చిత్రం)

Gold and Silver rate 30-5-2021: బంగారం, వెండి ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. సామాన్యులు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది. ధర రూ.50వేలకు దగ్గర్లో ఉంది. నేటి రేట్లు చూద్దాం.

    Gold and Silver price 30-5-2021: బంగారం ధరలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూసి నగలు కొనుక్కుందాం అనుకునేవారు... కాలం 2 నెలలు వెనక్కి వెళ్లిపోతే బాగుండు అనుకుంటారు. ఎందుకంటే... మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం ధర ఈ సంవత్సరంలోనే అతి తక్కువగా నమోదైంది. ఆ రోజున అది రూ.41,100 ఉంది. మరి ఇప్పుడో... రూ.45,800 అయ్యింది. అంటే 59 రోజుల్లో రూ.4,700 పెరిగింది. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... ఇప్పుడు రూ.49,950 ఉంది. అంటే 59 రోజుల్లో రూ.5,110 పెరిగింది. ఇలా ఇంత ఎక్కువగా పెరిగిపోతే... ఇక సామాన్య, మధ్యతరగతి వారు బంగారం ఏం కొనగలరు? కష్టమే.

    Gold rate 30-5-2021:
    గత 10 రోజుల్లో బంగారం ధర 4 సార్లు పెరగగా... 4 సార్లు స్థిరంగా ఉంది. 2 సార్లు తగ్గింది. నిన్న ధర పెరిగింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 10 గ్రాములు రూ.45,800 ఉంది. నిన్న ధర రూ.100 పెరిగింది. తులం బంగారం ధర ప్రస్తుతం రూ.36,640 ఉంది. నిన్న తులం ధర రూ.80 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,580 ఉంది. అలాగే పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.49,950 ఉంది. నిన్న ధర రూ.90 పెరిగింది. తులం బంగారం ధర రూ.39,960 ఉంది. నిన్న తులం ధర రూ.72 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,995 ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.

    Silver rate 30-5-2021:
    వెండి ధరలు గత పది రోజుల్లో 4 సార్లు పెరగగా... 4 సార్లు తగ్గాయి. 2సార్లు స్థిరంగా ఉన్నాయి. నిన్న కొద్దిగా పెరిగాయి. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.76,200 ఉంది. నిన్న ధర రూ.100 పెరిగింది. అలాగే... తులం (8 గ్రాములు) ధర రూ.609.60 ఉంది. నిన్న తులం ధర రూ.0.80 పెరిగింది. ఒక్క గ్రాము వెండి ధర రూ.76.20 ఉంది. 6 నెలల కిందట నవంబర్ 30న వెండి ధర కేజీ రూ.64,700 ఉంది. ఇప్పుడు రూ.76,100 ఉంది. అంటే 6 నెలల్లో వెండి ధర రూ.12,900 పెరిగింది.

    ఇది కూడా చదవండి: Weekly Horoscope: రాశి ఫలాలు... మే 30 నుంచి జూన్ 5 వరకు వార ఫలాలు

    పసిడి ధరలు పెరిగే ఛాన్స్:
    గోల్డ్ రేట్స్ ర్యాలీ ఇక కంటిన్యూగా కొన్ని నెలలపాటూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకునే దిశగా అడుగులు వేస్తుండటమే. అదే సమయంలో... డాలర్ కరెన్సీ విలువ తగ్గుతోంది. అటు స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో... బంగారం ధరలు జోరుగా పెరుగుతున్నాయి. బంగారంపై పెట్టుబడి పెడితే... బాగా కలిసొస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. 2 నెలల్లో బంగారంపై 11 శాతం రిటర్నులు వచ్చాయి. అందువల్ల ఇది మంచి పెట్టుబడి ఆప్షన్‌గా భావిస్తున్నారు. మరికొన్ని నెలల్లో గోల్డ్ రేట్లు రూ.60వేల మార్కును చేరుతాయని భావిస్తున్నారు. అందువల్ల పసిడిపై పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఐతే... ఇవన్నీ అంచనాలు మాత్రమే. పెట్టుబడి పెట్టాలనుకునేవారు... సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలే తప్ప... ఇలా ఎవరు ఏం చెప్పినా నమ్మవద్దని విశ్లేషకులు చెబుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Gold price, Gold rate, Gold rate hyderabad, Silver price, Silver rate

    తదుపరి వార్తలు