Gold Rate 7-6-2021: భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు... ఇవీ కారణాలు

Gold Rate 7-6-2021: భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

Gold and Silver rate 7-6-2021: దేశంలో బంగారం ధరలు రూ.60 వేలకు చేరుతాయని అంటున్నారు. అందుకు కొన్ని కారణాలను ఆర్థిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

  • Share this:
    Gold and Silver price 7-6-2021: దేశంలో 3 వారాలుగా కొలుకుంటున్నట్లు కనిపిస్తున్న స్టాక్ మార్కెట్లు ఈ వారం మరింతగా దూసుకెళ్తాయని ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులుచెబుతున్నారు. ఎందుకంటే... దేశంలో కరోనా తగ్గుతోంది. సెకండ్ వేవ్ పని అయిపోతోంది. అలాగే... నైరుతి రుతుపవనాలు టైముకి వచ్చేశాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FII)... పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లలోకి వస్తున్నాయి. అందువల్ల మళ్లీ సూచీలు పరుగులు పెడతాయని అంటున్నారు. ఇదే కారణం వల్ల బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఈ కారణంగా కూడా బంగారం ధరలు పెరుగుతూ... చివరకు ఆగస్టు నాటికి రూ.60 వేలకు చేరగలవు అంటున్నారు.

    రూ.50వేలు దాటేశాయి:
    మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడు (ఆదివారం నాటికి)... రూ.45,910 ఉంది. 67 రోజుల్లో ధర రూ.4,810 పెరిగింది. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... ఇప్పుడు రూ.50,080 ఉంది. అంటే 67 రోజుల్లో ధర రూ.5,240 పెరిగింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

    Gold Price 7-6-2021:
    గత 10 రోజుల్లో బంగారం ధర 7 సార్లు పెరగగా... 2 సార్లు తగ్గింది. 1 సారి స్థిరంగా ఉంది. నిన్న ధర కొద్దిగా పెరిగింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,591 ఉంది. నిన్న ధర రూ.1 పెరిగింది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.36,728 ఉంది. నిన్న తులం ధర రూ.8 పెరిగింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.45,910 ఉంది నిన్న ధర రూ.10 పెరిగింది.

    పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.5,008 ఉంది. నిన్న ధర రూ.1 పెరిగింది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.40,064 ఉంది. నిన్న తులం ధర రూ.8 పెరిగింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.50,080 ఉంది. నిన్న ధర రూ.10 పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.

    Silver Price 7-6-2021:
    వెండి ధరలు గత 10 రోజుల్లో 6 సార్లు పెరగగా... 3 సార్లు తగ్గాయి. 1 సారి స్థిరంగా ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్నాయి. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.76.30 ఉంది. నిన్న ధరలో మార్పు లేదు. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.610.40 ఉంది. నిన్న ధర స్థిరంగా ఉంది. అదే 10 గ్రాములు కావాలంటే... ధర రూ.763 ఉంది. నిన్న ధరలో మార్పు లేదు. 100 గ్రాములు ధర రూ.7,630 ఉండగా... కేజీ వెండి ధర... రూ.76,300 ఉంది. గత 6 నెలల్లో వెండి ధర రూ.13,300 పెరిగింది.

    ఇది కూడా చదవండి: Horoscope 7-6-2021: రాశి ఫలాలు... ఖర్చుల భారం... ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం

    పెట్టుబడులకు చివరి ఛాన్స్:
    బంగారంపై పెట్టుబడి పెట్టాలి అనుకునేవారికి ఇదే చివరి ఛాన్స్ అనుకోవచ్చు అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఇప్పుడు గానీ పెట్టుబడి పెట్టకపోతే... భవిష్యత్తులో పెట్టినా... పెద్దగా రిటర్నులు రావు అంటున్నారు. ఇప్పుడు రూ.50వేల దగ్గర ఉంది కాబట్టి... ఇప్పుడు పెట్టుబడి పెడితే... రూ.60వేలకు చెరినట్లైతే... అప్పుడు 20 శాతం రిటర్నులు పొందినట్లు అవుతుంది అంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు పెట్టుబడి పెట్టలేకపోతే... భవిష్యత్తులో పెట్టినా పెద్దగా రిటర్నులు రాకపోవచ్చు అంటున్నారు. అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని... నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: