Gold Rate 6-6-2021: పెరిగిన బంగారం, వెండి ధరలు... నైరుతీ రాకతో కొత్త అంచనాలు

Gold Rate 6-6-2021: పెరిగిన బంగారం, వెండి ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

Gold and Silver rate 6-6-2021: ఇండియాలోకి నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికే రావడంతో... ఈసారి బంగారం ధరలు మరింత భారీగా పెరగనున్నాయి. ఎందుకో తెలుసుకుందాం.

  • Share this:
    Gold and Silver price 6-6-2021: బంగారంపై పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారా... అయితే... ఇప్పుడే పెట్టండి... ఆలస్యమైతే... ధరలు మరింత పెరుగుతాయి అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఎందుకంటే... దేశంలో ఈ సంవత్సరం నైరుతి రుతు పవనాల జోరు బాగుంది. వర్షాలు బాగా పడతాయి. దాంతో పంటలు బాగా పండుతాయి. ఫలితంగా వ్యవసాయ రంగం జోరుగా ఉంటుంది. ద్రవ్య లిక్విడిటీ పెరుగుతుంది. దాంతో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని అంటున్నారు. తద్వారా ధరలు రూ.50వేల నుంచి రూ.60వేలకు పెరుగుతాయని అంటున్నారు. మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడు... రూ.45,900 ఉంది. 66 రోజుల్లో ధర రూ.4,800 పెరిగింది. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... ఇప్పుడు రూ.50,070 ఉంది. అంటే 66 రోజుల్లో ధర రూ.5,230 పెరిగింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

    Gold Price 6-6-2021:
    గత 10 రోజుల్లో బంగారం ధర 6 సార్లు పెరగగా... 3 సార్లు తగ్గింది. 1 సారి స్థిరంగా ఉంది. నిన్న ధర పెరిగింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,590 ఉంది. నిన్న ధర రూ.40 పెరిగింది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.36,720 ఉంది. నిన్న తులం ధర రూ.320 పెరిగింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.45,900 ఉంది నిన్న ధర రూ.400 పెరిగింది.

    పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.5,007 ఉంది. నిన్న ధర రూ.43 పెరిగింది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.40,056 ఉంది. నిన్న తులం ధర రూ.344 పెరిగింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.50,070 ఉంది. నిన్న ధర రూ.430 పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.

    Silver Price 6-6-2021:
    వెండి ధరలు గత 10 రోజుల్లో 6 సార్లు పెరగగా... 4 సార్లు తగ్గాయి. నిన్న కొద్దిగా పెరిగాయి. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.76.30 ఉంది. నిన్న ధర రూ.0.80 పెరిగింది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.610.40 ఉంది. నిన్న ధర రూ.6.40 పెరిగింది. అదే 10 గ్రాములు కావాలంటే... ధర రూ.763 ఉంది. నిన్న ధర రూ.8 పెరిగింది. కేజీ వెండి ధర చూస్తే... రూ.76,300 ఉంది. నిన్న ధర రూ.800 పెరిగింది. గత 6 నెలల్లో వెండి ధర రూ.2,300 పెరిగింది.

    ఇది కూడా చదవండి: Weekly Horoscope: వారఫలాలు... జూన్ 6 నుంచి 12 వరకు రాశి ఫలాలు

    బంగారం ధరల జోరు:
    బంగారం ధరలు 4 నెలల గరిష్టాన్ని దాటి మరింతగా దూసుకెళ్తున్నాయి. దేశంలో కరోనా జోరు తగ్గుతోంది కాబట్టి... బంగారం కొనుగోళ్లు బాగా జరుగుతాయనే అంచనా ఉంది. అలాగే పెట్టుబడులు కూడా పెరుగుతాయని అంటున్నారు. అటు కరెన్సీ చూస్తే... డాలర్ బలపడుతోంది. అందువల్ల విదేశాల నుంచి వచ్చే బంగారం దిగుమతుల ధరలు పెరగనున్నాయి. అందువల్ల కూడా దేశీయంగా బంగారం ధరలు పెరగనున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: