Home /News /business /

GOLD AND SILVER PRICE 5 JUNE 2021 GOLD AND SILVER RATES DOWN DUE TO WEAK BULLION MARKET AND STOCK MARKET NK

Gold price 5-6-2021: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు... నేటి మార్కెట్ అప్‌డేట్స్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

Gold and Silver rate 5-6-2021: రిజర్వ్ బ్యాంక్ రివర్స్ రెపో రేట్లను మార్చకపోవడంతో... స్టాక్ మార్కెట్లతోపాటు... బులియన్ మార్కెట్ కూడా నష్టాల్లోకి జారుకుంది. తాజా అప్‌డేట్స్ తెలుసుకుందాం.

    Gold and Silver price 5-6-2021: బంగారం ధరలు నిన్న భారీగా తగ్గినా.. ఓవరాల్ ట్రెండ్ చూస్తే మాత్రం ధరలు పెరిగాయనే అనుకోవాల్సి ఉంది. ఎందుకంటే... ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. అప్పుడప్పుడూ తగ్గినా... ఓవరాల్ ట్రెండ్ మాత్రం పెరుగుతూనే ఉంది. ప్రధానంగా... డాలర్ మారకపు విలువ పెరుగుతోంది. రూపాయి బలహీనపడుతోంది అందువల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై ఇదివరకటి కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారం... చివరకు కొనుగోలుదారులపై పడుతోంది. అందువల్ల బంగారం ధరలు నిన్న తగ్గినప్పటికీ... ఓవరాల్‌గా పెరుగుతున్నాయనే అనుకోక తప్పదు. మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడు... రూ.45,500 ఉంది. 65 రోజుల్లో ధర రూ.4,400 పెరిగింది. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... ఇప్పుడు రూ.49,640 ఉంది. అంటే 65 రోజుల్లో ధర రూ.4,800 పెరిగింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.























    గ్రాము22 క్యారెట్లుతగ్గుదల
    1 గ్రాము4,55070
    8 గ్రాములు (తులం)36,400560
    10 గ్రాములు45,500700

    పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) ఇలా ఉంది.























    గ్రాము 24 క్యారెట్లు తగ్గుదల
    1 గ్రాము4,96476
    8 గ్రాములు (తులం)39,712608
    10 గ్రాములు49,640760

    హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.

    Silver Price 5-6-2021:
    వెండి ధరలు గత 10 రోజుల్లో 6 సార్లు పెరగగా... 4 సార్లు తగ్గాయి. నిన్న భారీగా పెరిగాయి. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధరలు ఇలా ఉన్నాయి.

































    గ్రాముధరతగ్గుదల
    1 గ్రాము75.502
    8 గ్రాములు (తులం)60416
    10 గ్రాములు75520
    100 గ్రాములు7,550200
    1 కేజీ75,5002,000

    ఇది కూడా చదవండి: Horoscope 5-6-2021: రాశి ఫలాలు... నేడు ఎవరి అదృష్టం ఎలా ఉందంటే...

    బంగారం ధరలు తగ్గుతాయా?
    బంగారం ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా అన్నదానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు చెబుతున్నారు. కొందరేమో ఆర్థిక వ్యవస్థ మెరుగవుతోంది కాబట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయంటుంటే... మరికొందరు కరోనా తగ్గుతోంది కాబట్టి... బంగారంపై పెట్టుబడులను ఇతర మార్గాల్లోకి మళ్లించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. స్టాక్ మార్కెట్లు 3 వారాలుగా జోరుగా ఉన్నాయి. నిన్న మాత్రం నష్టాలతో ముగిశాయి. మరి వచ్చే సోమవారం అవి తిరిగి పుంజుకుంటే... బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Gold price, Gold rate, Silver price, Silver rate

    తదుపరి వార్తలు