Gold price 31-5-2021: 60 రోజుల్లో 5,120 పెరిగిన బంగారం ధర... మార్కెట్ రేట్లు ఇవీ

Gold price 31-5-2021: 60 రోజుల్లో 5,120 పెరిగిన బంగారం ధర... (ప్రతీకాత్మక చిత్రం)

Gold and Silver rate 31-5-2021: బంగారం ధరలు పెరుగుతూ ఉంటే... వెండి మాత్రం నిన్న భారీగా పడిపోయింది. ఈమధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా ధర తగ్గింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    Gold and Silver price 31-5-2021: బంగారం ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా అనేది కచ్చితంగా ఎవరూ అంచనా వెయ్యలేని పరిస్థితి ఉంటోంది. నిజానికి ఇండియాలో కరోనా కేసులు తగ్గుతుంటే... ఆ ప్రకారం బంగారం ధరలు తగ్గాలి. ఎందుకంటే... బంగారంపై పెట్టుబడులు... స్టాక్ మార్కెట్లు... ఇతర మార్గాల్లోకి మళ్లుతాయి. కానీ... అలా జరగట్లేదు. బంగారం ధరలు ఏప్రిల్ 1 నుంచి కంటిన్యూగా పెరుగుతూనే ఉన్నాయి. మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడు... రూ.45,810 అయ్యింది. 60 రోజుల్లో ధర రూ.4,70 పెరిగింది. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... ఇప్పుడు రూ.49,960 ఉంది. అంటే 60 రోజుల్లో ధఱ రూ.5,120 పెరిగింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

    Gold Price 31-5-2021:
    గత 10 రోజుల్లో బంగారం ధర 4 సార్లు పెరగగా... 4 సార్లు స్థిరంగా ఉంది. 2 సార్లు తగ్గింది. నిన్న ధర కొద్దిగా పెరిగింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 10 గ్రాములు రూ.45,810 ఉంది. నిన్న ధర రూ.10 పెరిగింది. తులం బంగారం ధర ప్రస్తుతం రూ.36,648 ఉంది. నిన్న తులం ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,581 ఉంది. అలాగే పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.49,960 ఉంది. నిన్న ధర రూ.10 పెరిగింది. తులం బంగారం ధర రూ.39,968 ఉంది. నిన్న తులం ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,996 ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.

    Silver Price 31-5-2021:
    వెండి ధరలు గత పది రోజుల్లో 4 సార్లు పెరగగా... 4 సార్లు తగ్గాయి. 2సార్లు స్థిరంగా ఉన్నాయి. నిన్న భారీగా పడిపోయాయి. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.71,600 ఉంది. నిన్న ధర రూ.4,600 తగ్గింది. ఈ మధ్యకాలంలో ఇంత ఎక్కువగా వెండి ధర ఎప్పుడూ తగ్గలేదు. అలాగే... తులం (8 గ్రాములు) ధర రూ.572.80 ఉంది. నిన్న తులం ధర రూ.36.80 తగ్గింది. ఒక్క గ్రాము వెండి ధర రూ.71.60 ఉంది. 6 నెలల కిందట డిసెంబర్ 1న వెండి ధర కేజీ రూ.64,600 ఉంది. ఇప్పుడు రూ.71,600 ఉంది. అంటే 6 నెలల్లో వెండి ధర రూ.7,000 పెరిగింది.

    ఇది కూడా చదవండి: Horoscope 31-5-2021: మే చివరి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే...

    పసిడి ధరలకు రెక్కలు:
    ఇండియాలో ఆర్థిక పరిస్థితులు మళ్లీ జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల బంగారం కొనుగోళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. అదే సమయంలో... డాలర్ కరెన్సీ విలువ పడిపోతోంది. అందువల్ల డాలర్‌పై పెట్టుబడులు... బంగారంవైపు మళ్లే ఛాన్స్ ఉంది. అటు స్టాక్ మార్కెట్లు కూడా దూసుకెళ్తున్నాయి కాబట్టి... స్టాక్ మార్కెట్లలో కూడా చాలా మంది షేర్లు కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్, సిప్ వంటివి బాగా పెరుగుతున్నాయి. అందువల్ల ఇప్పట్లో బంగారం ధరలు తగ్గవు అంటున్నారు. ఇప్పుడు రూ.50 వేల దగ్గర ఉన్న బంగారం ధర... రూ.60 వేలకు చేరడం ఖాయం అంటున్నారు. ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ వస్తే... అది మరింత ప్రమాదకరంగా ఉంటే... బంగారం ధరలు మరింత ఎక్కువగా పెరుగుతాయి అనే అంచనా ఉంది.
    Published by:Krishna Kumar N
    First published: