Home /News /business /

GOLD AND SILVER PRICE 2 JUNE 2021 CHECK TODAYS GOLD AND SILVER RATES HERE WITH COMPLETE STOCK MARKET AND BULLION MARKET DETAILS NK

Gold price 2-6-2021: రూ.50 వేలు దాటిన బంగారం ధర.. భగ్గుమంటున్న వెండి ధర

రూ.50 వేలు దాటిన బంగారం ధర (ప్రతీకాత్మక చిత్రం)

రూ.50 వేలు దాటిన బంగారం ధర (ప్రతీకాత్మక చిత్రం)

Gold and Silver rate 2-6-2021: బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. చూస్తుండగానే బంగారం రూ.50వేల మార్కును దాటేసింది. ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటుంటే... సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.

    Gold and Silver price 2-6-2021: ఆర్థిక సూత్రాల ప్రకారం... ఓ వస్తువుకు డిమాండ్ పెరిగినా, సప్లై తగ్గినా ధర పెరుగుతుంది. అలాగే... డిమాండ్ తగ్గినా, సప్లై పెరిగినా ధర తగ్గుతుంది. బంగారం విషయంలో ఈ ఫార్ములా వర్తిస్తూనే... మరో అంశమూ ప్రభావం చూపుతుంది. అదే పెట్టుబడులు. బంగారంపై పెట్టుబడులు పెరిగితే... ధర పెరుగుతుంది. పెట్టుబడులు తగ్గితే ధర తగ్గుతుంది. ప్రస్తుతం 2 నెలలుగా బంగారంపై పెట్టుబడులు పెరుగుతుంటే... ధర పెరిగిపోయి... సమాన్య, మధ్య తరగతి వారికి బంగారం మళ్లీ అందని ద్రాక్ష అయిపోయింది. మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడు... రూ.46,100 అయ్యింది. 62 రోజుల్లో ధర రూ.5,000 పెరిగింది. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... ఇప్పుడు రూ.50,300 ఉంది. అంటే 62 రోజుల్లో ధర రూ.5,460 పెరిగింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

    Gold Price 2-6-2021:
    గత 10 రోజుల్లో బంగారం ధర 6 సార్లు పెరగగా... 2 సార్లు స్థిరంగా ఉంది. 2 సార్లు తగ్గింది. నిన్న ధర కొద్దిగా పెరిగింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) ఇలా ఉంది.























    గ్రాము22 క్యారెట్లుపెరుగుదల
    1 గ్రాము4,61020
    8 గ్రాములు (తులం)36,880160
    10 గ్రాములు46,100200

    పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) ఇలా ఉంది.























    గ్రాము 24 క్యారెట్లు పెరుగుదల
    1 గ్రాము5,03023
    8 గ్రాములు (తులం)40,240184
    10 గ్రాములు50,300230

    హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.

    Silver Price 2-6-2021:
    వెండి ధరలు గత 10 రోజుల్లో 6 సార్లు పెరగగా... 2 సార్లు తగ్గాయి. 2సార్లు స్థిరంగా ఉన్నాయి. నిన్న భారీగా పెరిగాయి. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధరలు ఇలా ఉన్నాయి.

































    గ్రాముధరపెరుగుదల
    1 గ్రాము76.804.80
    8 గ్రాములు (తులం)614.4038.40
    10 గ్రాములు76848
    100 గ్రాములు7680480
    1 కేజీ76,8004,800

    ఇది కూడా చదవండి: Horoscope 2-6-2021: దిన ఫలాలు... ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్

    గోల్డ్ మరింత పెరిగే ఛాన్స్:
    ప్రస్తుత అంచనా ప్రకారం... డాలర్ మళ్లీ బలపడుతోంది. అంటే... విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి వ్యాపారులు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల బంగారంపై పన్నులు కూడా పెరుగుతాయి. అన్నీ కలిసి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అటు పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి... ప్రస్తుతం పెరుగుదల ట్రెండ్ నడుస్తోంది. స్టాక్ మార్కెట్లు కూడా 3 వారాలుగా కోలుకుంటున్నాయి. నిన్న ఫ్లాట్‌గా ముగిసినా... కరోనా తగ్గుతోంది కాబట్టి... దూసుకెళ్తాయనే అంచనా ఉంది. పెట్టుబడులు పెట్టేవారు ఈ అంశాలన్నీ లెక్కలోకి తీసుకోవాలని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Gold price, Gold rate, Silver price, Silver rate

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు