Gold price 1-6-2021: 5 నెలల గరిష్టానికి బంగారం ధరలు... తగ్గేదేలేదంటున్న పసిడి

5 నెలల గరిష్టానికి బంగారం ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

Gold and Silver rate 1-6-2021: ఇన్నాళ్లూ బంగారు నగలు కొనుక్కోవచ్చనే ఆశ పేద, మధ్య తరగతిలో కాస్తైనా ఉండేది. ఇప్పుడు ధరలు భారీగా పెరిగిపోవడంతో... ఇక నగలపై ఆశలు వదిలేసుకుంటున్నారు.

  • Share this:
    Gold and Silver price 1-6-2021: మన దేశంలో చాలా మంది మహిళలు బంగారు నగలు ధరించడమే మానేస్తున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉంటున్నాయి. ధరలు పెరిగిపోవడంతో... నగలు కొనుక్కునే పరిస్థితి లేదు. కరోనా దృష్ట్యా చాలా మంది ఉన్న నగలను తాకట్టు పెట్టేశారు. వాటిని విడిపించుకునే పరిస్థితి లేదు. కొందరు మహిళలు... చైన్ స్నాచర్ల భయంతో బంగారు నగలు వాడట్లేదు. ఇలా... పసిడి అనేది పేరుకే తప్ప... వాడేందుకు వీలు కావట్లేదు. అయినా ధరలు మాత్రం కొండెక్కుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి కంటిన్యూగా పెరుగుతూనే ఉన్నాయి. మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడు... రూ.45,900 అయ్యింది. 61 రోజుల్లో ధర రూ.4,800 పెరిగింది. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... ఇప్పుడు రూ.50,070 ఉంది. అంటే 61 రోజుల్లో ధర రూ.5,230 పెరిగింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

    Gold Price 1-6-2021:
    గత 10 రోజుల్లో బంగారం ధర 5 సార్లు పెరగగా... 3 సార్లు స్థిరంగా ఉంది. 2 సార్లు తగ్గింది. నిన్న ధర కొద్దిగా పెరిగింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 10 గ్రాములు రూ.45,900 ఉంది. నిన్న ధర రూ.90 పెరిగింది. తులం బంగారం ధర ప్రస్తుతం రూ.36,720 ఉంది. నిన్న తులం ధర రూ.72 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,590 ఉంది. అలాగే పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.50,070 ఉంది. నిన్న ధర రూ.110 పెరిగింది. తులం బంగారం ధర రూ.40,056 ఉంది. నిన్న తులం ధర రూ.88 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.5,007 ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.

    Silver Price 1-6-2021:
    వెండి ధరలు గత పది రోజుల్లో 5 సార్లు పెరగగా... 3 సార్లు తగ్గాయి. 2సార్లు స్థిరంగా ఉన్నాయి. నిన్న కొద్దిగా పెరిగాయి. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.72,000 ఉంది. నిన్న ధర రూ.400 పెరిగింది. అలాగే... తులం (8 గ్రాములు) ధర రూ.576 ఉంది. నిన్న తులం ధర రూ.3.20 పెరిగింది. ఒక్క గ్రాము వెండి ధర రూ.72 ఉంది. 6 నెలల కిందట డిసెంబర్ 1న వెండి ధర కేజీ రూ.64,600 ఉంది. ఇప్పుడు రూ.72,000 ఉంది. అంటే 6 నెలల్లో వెండి ధర రూ.7,400 పెరిగింది.

    మరింత పెరిగే ఛాన్స్:
    బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అమెరికా డాలర్ విలువ నిన్న పెరిగింది. అంటే... విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి ఇదివరకటి కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఆ భారాన్ని ప్రజలపై రుద్దుతారు. అందువల్ల ధరలు పెరుగుతాయి.

    ఇది కూడా చదవండి: Monthly Horoscope: మాస ఫలాలు... జూన్ నెల ఏ రాశి వారికి ఎలా ఉందంటే...

    స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. అంటే ఇన్వెస్టర్లు పెట్టుబడులను పెంచుతున్నారు. వాళ్లు ఒకే దాంట్లో పెట్టుబడి పెట్టరు. కొంత స్టాక్స్‌లో, కొంత మ్యూచువల్ ఫండ్స్‌లో, కొంత కరెన్సీలో, కొంత బంగారంపై ఇలా వేర్వేరు చోట్ల పెడుతుంటారు. బంగారం ఆల్రెడీ పెరుగుతోంది కాబట్టి... భారీ లాభాలు వస్తాయనే ఉద్దేశంతో దీనిపై పెట్టుబడులు పెడతారు. అటు వివాహాల కారణంగా... బంగారు నగల కొనుగోళ్లు కొంతైనా జరుగుతాయి. అందువల్ల కూడా ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published: