GODREJ PROPERTIES SELLS 575 CRORE FLATS IN NOIDA IN JUST ONE DAY MK GH
Godrej Properties: రియల్ ఎస్టేట్ రంగంలో గోద్రేజ్ హవా.. ఒక్క రోజులోనే 340 గృహాల విక్రయం
Godrej Properties
గోద్రేజ్ గ్రూప్‌నకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ గృహ నిర్మాణ రంగంలో అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో చేపట్టిన గోద్రేజ్ ఉడ్స్ ప్రాజెక్టు రెండో దశను గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రారంభించింది. తొలి రోజే ఏకంగా 340 గృహాలు విక్రయించినట్టు కంపెనీ స్వయంగా ప్రకటించింది. వీటి విలువ రూ.575 కోట్లు కావడం విశేషం.
నాణ్యమైన గృహాల విషయంలో గోద్రేజ్ ప్రాపర్టీస్‌పై కొనుగోలుదారులు అంతులేని నమ్మకాన్ని చూపుతున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో గోద్రేజ్ ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులో గృహాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో మరోసారి కస్టమర్లు సంస్థపై నమ్మకాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోద్రేజ్ గ్రూప్‌నకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ గృహ నిర్మాణ రంగంలో అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో చేపట్టిన గోద్రేజ్ ఉడ్స్ ప్రాజెక్టు రెండో దశను గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రారంభించింది. తొలి రోజే ఏకంగా 340 గృహాలు విక్రయించినట్టు కంపెనీ స్వయంగా ప్రకటించింది. వీటి విలువ రూ.575 కోట్లు కావడం విశేషం.
ఫారెస్ట్ థీమ్‌తో అత్యంత విలాసవంతమైన శ్రేణిలో నిర్మిస్తున్న ఈ గృహల మొత్తం విస్తీర్ణం 5 లక్షల చదరపు అడుగులు. ఎవర్గ్రీన్ అని పేరు పెట్టిన ఈ ప్రాజెక్టులో గడిచిన ఆరు నెలల కాలంలో సుమారు రూ.1,140 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. సెంట్రల్ నొయిడాకు సమీపంలో ఉంటుంది ఈ ప్రాంతం.
భారతదేశంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి. ఢిల్లీ-ఎన్సీఆర్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి గ్రోదేజ్ ప్రాపర్టీస్ సంస్థ 2010లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఐదు నగరాల్లో 17 ప్రాజెక్టులు చేపట్టింది. ఇప్పటికే ఇందులో ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసి కొనుగోలుదారులకు అందజేసింది.
ఢిల్లీ శివారులో ఉండే నొయిడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పరిధిలోకి వస్తుంది. నొయిడాలోని సెక్టార్ 43లో గోద్రేజ్ ప్రాపర్టీస్ సంస్థ అడవి థీమ్‌తో గృహాలు నిర్మిస్తోంది. దీని కోసం 600లకు పైగా వృక్షాలతో పచ్చని వనాన్ని అభివృద్ధిపరుస్తోంది. ఆధునిక జీవనశైలికి కావాల్సిన అన్ని హంగులు, సదుపాయాలు ఈ గృహాల్లో ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్, కేఫ్, కాలువ, ఒక అత్యాధునికత క్లబ్ హౌస్, తోటలు, అడవి మార్గం, ఒక ఎలివేటెడ్ వాక్ వే, టెన్నిస్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్టు సహ అధునిక అవసరాలన్నీ అందిస్తూ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది గోద్రేజ్ ప్రాపర్టీస్.
సెక్టర్ 43 సెంట్రల్ నొయిడాలోని దాద్రి మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో ఉండటం, సకల సామాజిక మౌలిక వసతులు అందుబాటులో ఉండటం వలన ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంటుంది. నొయిడా- గ్రేటర్ నొయిడా ఎక్స్‌ప్రెస్ వే ఈ గృహాలకు సమీపంలోనే ఉంది. సమీపంలోనే ఆస్పత్రులు, ప్రపంచస్థాయి విద్యా సంస్థలు, స్టార్ రేటింగ్ కలిగిన హోటళ్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.