GODREJ HOUSING FINANCE LAUNCHES NEW EMI SCHEME KNOW HOW CAN A CUSTOMER DESIGN EMIS SS GH
Godrej Housing Finance: గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి కొత్త ఈఎంఐ స్కీమ్
Godrej Housing Finance: గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి కొత్త ఈఎంఐ స్కీమ్
(ప్రతీకాత్మక చిత్రం)
Godrej Housing Finance | హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐ మీకు నచ్చినట్టుగా కట్టుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది గోద్రెజ్ హౌజింగ్ ఫైనాన్స్. ఈ స్కీమ్ వివరాలు తీసుకోండి.
గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ (జిహెచ్ఎఫ్) తమ కస్టమర్ల కోసం సరికొత్త పాలసీని ప్రారంభించింది. కస్టమర్లు తమ సొంతింటి కోసం తీసుకున్న హోమ్‌లోన్ మొత్తాన్ని సమానమైన నెలవారీ వాయిదా (ఈఎంఐ)ల రూపంలో చెల్లించేందుకు వీలుగా ‘డిజైన్ ఈఎంఐ’ హోమ్‌లోన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు కట్టలేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కొత్త విధానంతో కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా EMI లను మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ MD & CEO మనీష్ షా. ఇందులో ఒక కస్టమర్ తన చెల్లింపులను చిన్న ఈఎంఐలతో ప్రారంభించి, క్రమంగా పెంచుకోవచ్చు.
ఉదాహరణకు, ఒక కస్టమర్ ఇళ్లు కొనడానికి రూ.50 లక్షల రుణం తీసుకుంటే.. దాని కోసం ప్రతి నెలా సుమారు రూ. 40,000 ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. అయితే, ప్రారంభంలో అంత మొత్తంలో కట్టలేని వారు చిన్న ఈఎంఐలతో రీపేయిమెంట్ ప్రారంభించి, ఆ తర్వాత క్రమంగా పెంచుకోవచ్చు. అంటే మొదటి సంవత్సరంలో నెలకు రూ.10,000, రెండవ సంవత్సరంలో నెలకు రూ.20,000, మూడో సంవత్సరంలో నెలకు రూ. 30,000 ఇలా క్రమంగా ఈఎంఐలను పెంచుకోవచ్చు. దీని వల్ల ఎక్కువ లోన్ కాల వ్యవధి పెరుగుతుంది. కానీ వడ్డీ మాత్రం ఒకేవిధంగా ఉంటుంది. ఇది తక్కువ ఆదాయం గల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది ఖర్చులు తగ్గించుకుంటున్నందున ఈఎంఐ ఎక్కువ కట్టే సామర్థ్యం ఉంటుంది. అటువంటి వారు తమ ఈఎంఐని నెలకు రూ. 60,000లకు పెంచమని కోరవచ్చు. మీ ఖర్చులు సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు, నెలవారీ ఈఎంఐలను రూ. 40,000లకు తగ్గించుకోవచ్చు. అయితే, నెలవారీ ఖర్చులు, ఆదాయాన్ని బట్టి ఈఎంఐ మొత్తాన్ని పెంచాలా? లేదా తగ్గించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని మనీష్ షా వివరించారు.
మూడేళ్లలో రూ.10 వేల కోట్ల బిజినెస్ లక్ష్యంగా..
గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ 2020 నవంబర్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. రాబోయే మూడేళ్లలో రూ.10,000 కోట్ల బిజినెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం సులభతరమైన ఈఎంఐ పాలసీకి రూపకల్పన చేసింది. ఈ సరికొత్త విధానాన్ని తొలుత పుణెలో ప్రారంభించింది. త్వరలోనే దీన్ని ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో కూడా ప్రారంభించనుంది.
ఎక్కువ మందికి లోన్ అందించేందుకు సంస్థ ఈ ప్రాసెస్ మొత్తాన్ని డిజిటలైజ్ చేసింది. ఎటువంటి ఫిజికల్ డాక్యుమెంట్ అవసరం లేకుండానే ఆన్లైన్లో లోన్ మంజూరు చేస్తామని తెలిపింది. దీని కోసం కంపెనీ ఎండ్- టు- ఎండ్ డిజిటల్ హోమ్ లోన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తద్వారా కస్టమర్, జిహెచ్ఎఫ్ ఉద్యోగి డైరెక్ట్‌గా ఇంటరార్ట్ కాకపోయినా లోన్ మంజూరు ప్రక్రియ పూర్తవుతుంది. మే నెలలో దాదాపు 100 మంది కస్టమర్లకు ఈ ఎండ్ -టు -ఎండ్ విధానంలో లోన్ మంజూరు చేసినట్లు మనీష్ షా చెప్పారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.