Godrej: కొత్త వ్యాపారంలోకి గోద్రేజ్ గ్రూప్.. రూ. 10 వేల కోట్ల లాభమే లక్ష్యం

Godrej: గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ 6.69 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో గృహ రుణాలు అందించనుంది. రానున్న మూడేళ్లలో రూ.10,000 కోట్ల వరకు లాభాలు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

news18-telugu
Updated: November 12, 2020, 5:16 PM IST
Godrej: కొత్త వ్యాపారంలోకి గోద్రేజ్ గ్రూప్.. రూ. 10 వేల కోట్ల లాభమే లక్ష్యం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గోద్రేజ్ గ్రూప్ ఆర్థిక సేవల (financial services) విభాగంలోకి ప్రవేశించింది. తాజాగా ప్రారంభించిన హౌసింగ్ ఫైనాన్స్ సేవల ద్వారా ఆ సంస్థ అధికారికంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ 6.69 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో గృహ రుణాలు అందించనుంది. రానున్న మూడేళ్లలో రూ.10,000 కోట్ల వరకు లాభాలు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ముందు ముంబై, దిల్లీ-ఎన్‌సీఆర్, పుణె, బెంగళూరు నగరాల్లో గృహ రుణాలు ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇందుకు గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్‌ సహా ఇతర డెవలపర్లతో కూడా పార్ట్నర్‌షిప్‌ను ఏర్పాటు చేసుకుంటామని ఆ సంస్థ తెలిపింది. తాజా హౌసింగ్ కంపెనీతో గ్రూపులోని రియల్ ఎస్టేట్ విభాగానికి ఎలాంటి సంబంధం లేదని గోద్రెజ్ పేర్కొంది. "ఇది ప్రస్తుతం గోద్రేజ్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక ప్రైవేట్ సంస్థగానే ఉంటుంది" అని గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఛైర్మన్ పిరోజ్ షా గోద్రేజ్ మంగళవారం ఒక వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

గ్రూపు నుంచే పెట్టుబడులు

హౌసింగ్ లోన్ వ్యాపారం కోసం ప్రారంభించిన తాజా కంపెనీలో పెట్టుబడులను (ఈక్విటీని) గోద్రేజ్ గ్రూప్ పెడుతుందని పిరోజ్ షా గోద్రేజ్ చెప్పారు. ఇది మొదటి మూడేళ్లలో రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు ఉంటుందన్నారు. అంతకు మించిన ఈక్విటీ అవసరమైతే, తరువాతి దశలో దాన్ని అంచనా వేస్తామని ఆయన వివరించారు.

నిబంధనలు ఎక్కువ
ప్రస్తుతం హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ బలహీనంగా ఉందని గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనీష్ షా చెబుతున్నారు. ఈ విభాగంలో కఠినమైన నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పారు. దీని వల్ల వినియోగదారులకు సరైన సేవలు అందించడం కష్టంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము పారదర్శకంగా ఈ వ్యాపారం చేస్తామని మనీష్‌ వివరిస్తున్నారు.

దీర్ఘకాల లాభాలపై దృష్టి
రానున్న ఏడు, ఎనిమిది సంవత్సరాల్లో 32,000 నుంచి 35,000 కోట్ల రూపాయల వరకు లాభాలు సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు షా చెప్పారు. సమీప భవిష్యత్తులో ఆస్తులను తనఖా పెట్టుకొని రుణాలు ఇవ్వాలనుకుంటున్నామని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తరువాత వ్యాపార, వ్యక్తిగత రుణాలపై దృష్టి పెడతామని పేర్కొంది. కానీ డెవలపర్లకు రుణాలు ఇచ్చే ఆలోచన లేదని ఆ సంస్థ ప్రకటించింది.
Published by: Kishore Akkaladevi
First published: November 12, 2020, 5:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading