Flight Offers: ఫ్లైట్ టికెట్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన గోఎయిర్, విస్తారా

Flight Offers | జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించే కస్టమర్లు www.goair.in వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో GOAIR10 ప్రోమో కోడ్ ఉపయోగించి అదనంగా 10% డిస్కౌంట్ పొందొచ్చు.

news18-telugu
Updated: June 18, 2019, 11:01 AM IST
Flight Offers: ఫ్లైట్ టికెట్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన గోఎయిర్, విస్తారా
Flight Offers: ఫ్లైట్ టికెట్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన గోఎయిర్, విస్తారా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
టూర్ వెళ్తున్నారా? ఇంకొన్ని రోజుల్లో ఎక్కడికైనా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటున్నారా? మీకు గుడ్ న్యూస్. విమానయాన సంస్థలైన గోఎయిర్, విస్తారా కంపెనీలు ప్రయాణికులకు ఆఫర్లు ప్రకటించాయి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ప్రయాణించేవారు ఈ ఆఫర్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. గోఎయిర్ సేల్ జూన్ 18న ప్రారంభమైంది. జూలై 23 వరకు కొనసాగుతుంది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించే కస్టమర్లు www.goair.in వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో GOAIR10 ప్రోమో కోడ్ ఉపయోగించి అదనంగా 10% డిస్కౌంట్ పొందొచ్చు. టికెట్ ధరలు రూ.1,769 నుంచి ప్రారంభమౌతాయి.

మరోవైపు విస్తారా కూడా 'గ్రాండ్ విస్తారా మాన్‌సూన్ సేల్' పేరుతో 48 గంటల సేల్ ప్రకటించింది. అన్ని క్లాసుల టికెట్లపై ఆఫర్లు అందిస్తోంది. ఎకనమీ క్లాస్ టికెట్ ధర రూ.1,299, ప్రీమియం ఎకనమీ టికెట్ ధర రూ.1,999, బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.4,999 నుంచి ప్రారంభమౌతాయి. జూన్ 18న ప్రారంభమైన సేల్ జూన్ 19 అర్థరాత్రి వరకు కొనసాగుతుంది. జూలై 3 నుంచి సెప్టెంబర్ 26 వరకు ప్రయాణించేవారికి మాత్రమే ఆఫర్లు వర్తిస్తాయి.

Business: మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి




ఇవి కూడా చదవండి:

Jio Cricket: మై జియో యాప్‌లో క్రికెట్ కాంటెస్ట్... ఆడండి ఇలా
Loading...
UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఎందుకు అవసరమో తెలుసా?
First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...