హోమ్ /వార్తలు /బిజినెస్ /

Go First Offers: స్వాతంత్య్ర దినోత్సవం, రాఖీ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లు.. ఫ్రీగా గోవా, మాల్దీవులు వెళ్లే ఛాన్స్..

Go First Offers: స్వాతంత్య్ర దినోత్సవం, రాఖీ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లు.. ఫ్రీగా గోవా, మాల్దీవులు వెళ్లే ఛాన్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రక్షాబంధన్, స్వాతంత్య్ర దినోత్సవం సందడి దేశ వ్యాప్తంగా మొదలైంది. వివిధ ప్రముఖ వ్యాపార సంస్థలు సైతం మంచి మంచి ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చాయి.

కరోనా కారణంగా కొన్నాళ్లుగా నిరుత్సాహంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు మళ్లీ పండగ వాతావరణంలోకి వెళ్లనున్నారు. రక్షాబంధన్, స్వాతంత్య్ర దినోత్సవం సందడి దేశ వ్యాప్తంగా మొదలైంది. వివిధ ప్రముఖ వ్యాపార సంస్థలు సైతం మంచి మంచి ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చాయి. తాజాగా ప్రముఖ విమనాయాన సంస్థ గో ఫస్ట్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. స్వాతంత్య్ర దినోత్సవం, రక్షాబంధన్ సందర్భంగా సూపర్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్లతో ప్రయాణికులు గోవా, మాల్దివులకు ఉచితంగా వెళ్లే అవకాశాన్ని అందిస్తోంది గో ఫస్ట్. అయితే, ఈ ఆఫర్ కేవలం కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటుందని గో ఫస్ట్ తెలిపింది. ఈ నెల 15, 22 తేదీల్లో జర్నీ చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ఈ సమయంలో ప్రయాణించిన వారికి గిఫ్ట్ లు కూడా అందిస్తారు.

SBI Home Loan: కొత్త ఇల్లు కొనాలనుకుంటున్న వారికి SBI శుభవార్త.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బంపరాఫర్

ఆగస్టు 15న ప్రయాణించిన వారికి గోవా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇద్దరు దంపతులకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ పై గోవాకు వెళ్లిన వారు అక్కడ మూడు రోజుల పాటు గడపొచ్చు. అక్కడ ఆహార ఖర్చులను సైతం గో ఫస్ట్ సంస్థే భరిస్తుంది. ఈ నెల 22 ప్రయాణం చేసిన వారు మాల్దివులుకు వెళ్లే ఛాన్స్ కొట్టేయొచ్చని సంస్థ తెలిపింది.

ఇద్దరు దంపతులకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ట్రిప్ 4 రోజులు ఉంటుందని సంస్థ తెలిపింది. అక్కడికి వెళ్లిన వారికి ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ సైతం అందించనున్నారు. ఇండిపెండెన్స్ డే, రక్షా బంధన్ వేడుకల సందర్భంగా కంపెనీ ఇలాంటి ఆఫర్లను తీసుకువచ్చింది.

First published:

Tags: Flight Offers, Goa, Independence Day 2021, Maldives

ఉత్తమ కథలు