పదవీ విరమణ చేసిన వారికి ఆర్థిక భద్రత, స్థిరత్వాన్ని అందించే పెన్షన్ ప్రోగ్రామ్స్ (Pension Systems).. మలి వయసులో వృద్ధులకు ఆసరాగా నిలుస్తాయి. భారత్‌తో పాటు ఇతర దేశాలు కూడా ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే గ్లోబల్ పెన్షన్ సిస్టమ్ రిపోర్ట్- 2022 ప్రకారం.. ఐస్‌లాండ్ పెన్షన్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా రికార్డు సృష్టించింది. ఈ లిస్ట్‌లో నెదర్లాండ్స్ రెండవ స్థానం సాధించగా, భారత్ 41వ స్థానంలో నిలిచింది.
రిటైర్మెంట్ తర్వాత భరోసా ఇచ్చే పెన్షన్ స్కీమ్స్ చాలా ముఖ్యమైనవి. కానీ ప్రపంచ జనాభాలో 65% మందికి పెన్షన్ అందుబాటులో లేదు. మన దేశ జనాభాలో 15% మందికి మాత్రమే పెన్షన్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇండియాలో 57% మంది సీనియర్ సిటిజన్లకు ఎలాంటి పెన్షన్ అందడం లేదు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిలో 26% మంది తక్కువ మొత్తాన్ని మాత్రమే పొందుతున్నారు.
ఆర్థిక నిపుణుల ప్రకారం, ప్రజలు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కోసం సమతుల్య పెట్టుబడులు, మెరుగైన పెన్షన్ వ్యవస్థల గురించి ఆలోచించాలి. ఇక పదవీ విరమణ ఆదాయ వ్యవస్థలు పెరుగుతున్న జనాభా అంచనాలకు మద్దతు ఇవ్వగలగాలి. ఇండియా ఈ విషయంలో చాలా వెనుకబడింది. అందుకు నిదర్శనంగా గ్లోబల్ పెన్షన్ సిస్టమ్ రిపోర్ట్ 2022 ర్యాంకింగ్స్‌లో మన దేశం తక్కువ స్కోరుతో 41వ స్థానంలో నిలిచింది. అత్యుత్తమ పెన్షన్లలో గ్రూప్ డికే పరిమితమైంది.
మరోవైపు 84.7 స్కోర్‌తో ఐస్‌లాండ్ పెన్షన్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా రికార్డు సృష్టించింది. నెదర్లాండ్స్ 84.6 స్కోర్‌తో రెండవ స్థానంలో ఉంది. ఈ లిస్ట్‌లో అమెరికా 20వ స్థానంలో ఉంది.
* అక్కడ ప్రత్యేకం
నెదర్లాండ్స్ పెన్షన్ సిస్టమ్‌లో రాష్ట్ర పెన్షన్, వృత్తిపరమైన పెన్షన్, వ్యక్తిగత పెన్షన్ ఉంటాయి. రాష్ట్ర పెన్షన్ నివాసితులందరికీ ప్రాథమిక స్థాయి మద్దతును అందిస్తుంది. వృత్తిపరమైన, వ్యక్తిగత పెన్షన్లు ఈ మద్దతును భర్తీ చేస్తాయి. నెదర్లాండ్స్ పెన్షన్ సిస్టమ్ అధిక స్థాయి కవరేజ్, మంచి నిధులతో కూడిన పెన్షన్ స్కీమ్‌తో అత్యంత స్థిరమైనదిగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : మండే ఎండల్లో చల్ల చల్లగా.. డైకిన్ ఏసీలపై మంచి డిస్కౌంట్లు..
* భారత్‌లో ఇలా..
భారతదేశపు పెన్షన్ వ్యవస్థ అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. మన దేశ పెన్షన్ వ్యవస్థ మూడు భాగాలుగా ఉంటుంది. వాటిలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), ప్రైవేట్ రంగ పెన్షన్ పథకాలు ఉన్నాయి.
EPFO ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇక NPS పౌరులందరికీ అందుబాటులో ఉండే స్వచ్ఛంద పెన్షన్ పథకం. ప్రైవేట్ రంగం మ్యూచువల్ ఫండ్స్ , బీమా ప్రొడక్ట్స్, పదవీ విరమణ పొదుపు పథకాలు వంటి వివిధ పెన్షన్ పథకాలను అందిస్తుంది. అయితే పదవీ విరమణ చేసిన వారికి తగిన కవరేజీ మద్దతును అందించడంలో భారతదేశ పెన్షన్ వ్యవస్థ ఇంకా చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pension Scheme, Pensions, Personal Finance