GLOBAL INSURANCE GLOBAL INSURANCE POLICIES DO NOT APPLY IN TIMES OF WAR HERE ARE THE REASONS GH VB
Global Insurance: యుద్ధ సమయాల్లో గ్లోబల్ ఇన్సూరెన్స్ పాలసీలు వర్తించవు.. కారణాలు ఇవే..!
ప్రతీకాత్మక చిత్రం
ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం శాంతియుతంగా ఉండే ప్రాంతాలలో అనిశ్చితులను కూడా బయటపెట్టింది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఉద్రిక్తతలు పెరగడంతో చాలా మంది భారతీయ విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం శాంతియుతంగా ఉండే ప్రాంతాలలో అనిశ్చితులను కూడా బయటపెట్టింది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఉద్రిక్తతలు పెరగడంతో చాలా మంది భారతీయ విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. బయటపడేందుకు మార్గాలు వెతుక్కొనే అవకాశం కూడా వారికి లేదు. ఇలాంటి సమయాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు(Travel Insurance Policy) వర్తించవు. గాయపడి ఏదైనా ఆస్పత్రిలో చికిత్స చేయించుకొనేందుకు చేరినా ఖర్చులు కవర్ కావు. యుద్ధం, యుద్ధవాతావరణ పరిస్థితుల్లో పాలసీదారులకు సాధారణ బీమా పాలసీలు (General Insurance Policy) అమలు కావు. గ్లోబల్ కవరేజీని అందించే సాధారణ ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం వేరియంట్లకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది.
మీరు అటువంటి ఆరోగ్య పాలసీలు తీసుకొని ఉంటే.. విదేశాలలో తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స పొందవలసి వస్తే, మీ చికిత్స ఖర్చులను పాలసీ కవర్ చేస్తుంది. కానీ యుద్ధం సమయంలో వర్తించవు. అదే విధంగా కరోనా చికిత్సకు కవరేజీ వర్తిస్తుంది. ఈ పాలసీలు విదేశీ ప్రయాణ బీమా పాలసీలకు విభిన్నంగా ఉంటాయి. విదేశాలలో అత్యవసర చికిత్సలను మాత్రమే కవర్ చేస్తాయి. ప్రయాణ బీమా పాలసీలలా కాకుండా.. ఇవి సాధారణ, దేశీయ ఆరోగ్య పాలసీలు. భారతదేశం వెలుపల చికిత్స కోసం అవసరమైనప్పుడు ఖర్చులను చెల్లిస్తాయి. అటువంటి ప్రీమియం ప్లాన్లు సాధారణంగా రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్ల మధ్య బీమా కల్పిస్తాయి. ఇటీవల సంవత్సరాలలో ప్రధానంగా హెచ్ఎన్ఐ సెగ్మెంట్లో జనాదరణ పొందాయని బీమా సంస్థలు చెబుతున్నాయి.
నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, అండర్ రైటింగ్ , క్లెయిమ్స్ డైరెక్టర్ భబతోష్ మిశ్రా మాట్లాడుతూ.. ‘పారిశ్రామికవేత్తలు, వైద్యులు, సీనియర్ మేనేజ్మెంట్ నిపుణులు, ప్రముఖులు ఈ పాలసీలపై ఆసక్తి చూపుతారు. మాకు చాలా పెద్ద కస్టమర్ బేస్ ఉంది. కానీ మొత్తం పరిమాణం ఇప్పటికీ చిన్నది. అయినప్పటికీ.. ఈ పాలసీలకు కూడా యుద్ధం సమయంలో మినహాయింపు ఉంది. ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితుల కారణంగా తగిలిన గాయాలు ఈ పాలసీల కింద కవర్ కావు. మహమ్మారి లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆసుపత్రిలో చేరితే కవరేజ్ లభిస్తుంది. గ్లోబల్ కవరేజ్ ఆరోగ్య బీమా అందిస్తున్న దేశానికి వెళ్లి, అదే సమయంలో కరోనా కవరేజ్ ఒప్పందం కుదుర్చుకుంటే, ఆసుపత్రి ఖర్చులు కవర్ అవుతాయి.’ అని చెప్పారు.
* సాధారణ పరిస్థితుల్లో విదేశాలలో చికిత్స
సాదా-వనిల్లా హెల్త్ కవర్ - గ్లోబల్ కవరేజ్ లేకుండా - అధునాతన చికిత్స కోసం విదేశాలకు వెళ్తే ఉపయోగపడవు. ఇక్కడే గ్లోబల్ కవరేజీతో కూడిన అధిక-విలువ పాలసీలు ఉపయోగపడతాయి.
* పరిమితులను గమనించండి
గ్లోబల్ కవరేజ్ ఫీచర్ సౌకర్యాన్ని అందించినప్పటికీ.. పరిమితులు, మినహాయింపులతో వస్తుంది. ఇతర ఆరోగ్య కవర్ల మాదిరిగానే.. బీమా సంస్థ వాస్తవ చికిత్స ఖర్చులను చెల్లిస్తుంది. ఆస్పత్రిలోచేరిన తర్వాత జరిగే వైద్య పరీక్షలను మాత్రమే కవర్ చేస్తుంది. పాలసీని తీసుకొనే ముందు ఫీచర్ కింద జాబితాలోని అనారోగ్యాల సంఖ్య, పరిధిని తనిఖీ చేయాలి. బీమా సంస్థలు అన్ని చికిత్సా విధానాలకు చెల్లించవు. అనారోగ్యాల విస్తృత నిర్వచనాలను కలిగి ఉన్న పాలసీ నిబంధనలు ఇరుకైన నిర్వచనాలతో ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో పరిస్థితులు కవర్ చేస్తాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.