క్రూడ్ ఆయిల్ పతనం భారత ఆర్థిక వ్యవస్థకు కలిసివచ్చే అంశమే...బ్యాంక్ ఆఫ్ అమెరికా వెల్లడి

క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు తగ్గుముఖం పడతాయని అంచనా వేశాయి. ఇది జీడీపీ వృద్ధికి దోహదపడుతుందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అంచనా వేసింది.

news18-telugu
Updated: March 12, 2020, 1:56 PM IST
క్రూడ్ ఆయిల్ పతనం భారత ఆర్థిక వ్యవస్థకు కలిసివచ్చే అంశమే...బ్యాంక్ ఆఫ్ అమెరికా వెల్లడి
ధరలు తగ్గించిన తర్వాత హైస్పీడ్ డీజిల్ ధర రూ.33.94 అవుతుంది. పెట్రోల్ ధర రూ.20.68 వరకు తగ్గవచ్చని అంచనా.
  • Share this:
ఫ్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పతనం మన ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అంశమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్, బ్యాంకు ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇదే విషయమం తమ అభిప్రాయాలను తెలిపాయి. దేశీయంగా మన చమురు అవసరాల్లో 84 శాతం వరకూ దిగుమతులపైనే ఆధారపడుతున్నామని, ఈ నేపథ్యంలో..క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు తగ్గుముఖం పడతాయని అంచనా వేశాయి. ఇది జీడీపీ వృద్ధికి దోహదపడుతుందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అంచనా వేసింది. క్రూడ్ ఉత్పత్తి కోత విషయంలో రష్యా, సౌదీ అరేబియా మధ్య విభేదాలు తలెత్తడంతో.. బ్యారెల్‌ చమురు 30 డాలర్లకు పడిపోయింది. అటు కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రనపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్‌ తగ్గిపోయింది ఇది కూడా ధరలపై ప్రభావం చూపిస్తోంది. ఇదిలా ఉంటే చమురు ధర బ్యారెల్‌పై ప్రతీ 10 డాలర్ల పతనంతో 15 బిలియన్‌ డాలర్లు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇది జీడీపీలో క్యాడ్‌ 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గేలా చేస్తుందని కోటక్‌ తన నివేదికలో పేర్కొంది. చమురు ధరలు తగ్గడం ఆటోమొబైల్స్, విమానయానం, రంగుల పరిశ్రమ, కన్జ్యూమర్‌ కంపెనీలు, సిటీ గ్యాస్‌ పంపిణీ సంస్థలు, చమురు విక్రయ సంస్థలకు కలసిసొస్తుందని కోటక్‌ తెలిపింది. కానీ, చమురు బ్యారెల్‌కు 35 డాలర్లకు దిగువన ఉంటే ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాకు నికర నష్టాలు ఎదురవుతాయని అంచనా వేసింది.

చమురు ధరల పతనంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గి జీడీపీలో 0.7 శాతానికి పరిమితం అవుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. కరోనా వైరస్‌ జనవరిలో వెలుగు చూసిన తర్వాత నుంచి చమురు ధరలు 45 శాతం వరకు క్షీణించాయి. ఒకవేళ అంతర్జాతీయ మాంద్యం ఏర్పడితే ప్రపంచ వృద్ధి రేటు 1.4 శాతానికి, భారత జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతానికి తగ్గొచ్చని బ్యాంకు ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది.
Published by: Krishna Adithya
First published: March 12, 2020, 1:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading