హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: ఇలాంటి ఆవు ఒక్కటి ఉంటే చాలు.. రైతుకు ప్రతి నెలా లక్షల్లో ఆదాయం

Business Idea: ఇలాంటి ఆవు ఒక్కటి ఉంటే చాలు.. రైతుకు ప్రతి నెలా లక్షల్లో ఆదాయం

గిర్ జాతి ఆవు

గిర్ జాతి ఆవు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మన దేశంలో పాల వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎన్నో కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఎంతో మంది వ్యక్తులు.. పెద్ద పెద్ద ఉద్యోగాలను వదిలిపెట్టి.. సొంత గ్రామాల్లో పాల వ్యాపారం చేస్తున్నారు. ఆవులు, గేదెలను పెంచుతూ... భారీగా ఆదాయం పొందుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పాలు మంచి ఆదాయ వనరుగా ఉంది. అందుకే సొంత వ్యాపారం చేయాలనుకునే వారిలో ఎక్కువ మంది పాల వ్యాపారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఐతే పాల వ్యాపారం మొదలు పెట్టే ముందు.. ఏ రకమైన ఆవులు, గేదెల పెంచాలన్న దానిపై కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఏ జాతి ఆవుతో ఎక్కువ ప్రయోజనాలుంటాయో తెలుసుకోవాలి. కొందరికి ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎక్కువ పాలిచ్చే జాతికి ఎంచుకోకపోవడంతో.. పాల దిగుబడి తగ్గి.. తక్కువ లాభమే వస్తుంది. అందువల్ల ఎక్కువ పాలిచ్చే మేలు జాతి ఆవులను ఎంచుకోవాలి. కొన్ని రకాల ఆవులు రోజుకు 50 లీటర్ల పాలిస్తాయి. వాటి పెంపకం ద్వారా రైతులు ప్రతి నెలా లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు.

గిర్ ఆవులు:

మన దేశంలో అత్యధిక పాలిచ్చే ఆవు జాతిగా గిర్ ఆవులకు పేరుంది. వీటి పొదుగు చాలా పెద్దగా ఉంటుంది. గుజరాత్‌లోని గిర్ అడవుల్లో ఎక్కువగా కనిపించే ఈ ఆవులను ప్రస్తుతం దేశమంతటా పెంచుతున్నారు. బ్రెజిల్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో కూడా గిర్ ఆవులను పెంచుతారు. ఇవి సగటున రోజుకు 12 నుంచి 20 లీటర్ల వరక పాలు ఇస్తాయి. మంచి పోషకాహరం ఇస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుంటే.. 50 లీటర్ల వరకు పాలిస్తాయి. నెలవారీగా 1500-1800 లీటర్ల వరకు పాలు ఇస్తాయి.

లాల్ సింధీ ఆవు:

ఎక్కువ ఆదాయం పొందాలనుకునే రైతులు లాల్‌సింధీ ఆవులును కూడా పెంచుకోవచ్చు. ఈ ఆవు సింధ్ ప్రాంతానికి చెందినది. అందువల్ల వీటిని లాల్ సింధీ ఆవులు అని పిలుస్తారు. ప్రస్తుతం పంజాబ్, హర్యానా, కర్నాటక, తమిళనాడు , కేరళ , ఒడిశా రాష్ట్రాలకు చెందిన రైతులు ఎక్కువగా ఈ ఆవులను పెంచుతున్నారు. పాల ఉత్పత్తి సామర్థ్యంలో గిర్ ఆవులకు ఏ మాత్రం ఇవి తక్కువ కాదు. సగటున 12 నుంచి 20 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. వాటికి ఇంకా బాగా చూసుకుంటే.. 50 లీటర్ల వరకు పాలు ఇస్తాయి.

సాహివాల్ ఆవు:

సాహివాల్ జాతికి చెందిన ఆవులను హర్యానా; ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా పెంచుతున్నారు. ఇవి ప్రతి రోజు 10-20 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. మంచి సంరక్షణతో నెలకు 40 లీటర్ల వరకు పాలను ఉత్పత్తి చేయవచ్చు. చాలా మంది రైతులు, డైరీ నిర్వాహులకు ఎంతో ఇష్టమైన ఆవు ఇది. లక్షలాది రైతులు వీటిని పెంచుతూ.. భారీగా ఆదాయం పొందుతున్నారు.

ఈ మూడు జాతులకు చెందిన ఆవులను ఒక్కొక్కటి పెంచుకున్నా.. ప్రతి నెలా రూ.5 వేల లీటర్ల వరకు పాలను ఉత్తత్తి చేయవచ్చు. లీటర్‌కు రూ.60 వేలు అనుకున్నా.... నెలకు రూ.3 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులన్నీ పోయినా.. రూ. లక్షా 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు మిగులుతుంది. ఈ పాలతో నెయ్యి, పన్నీర్,పెరుగు వంటి పాల ఉత్పత్తులను తయారు చేస్తే.. మరింత అధిక ఆదాయం వస్తుంది.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

ఉత్తమ కథలు