సేఫ్ గోల్డ్ వాట్సప్‌లో గోల్డ్ గిఫ్ట్ చేయచ్చనే విషయం అత్యంత ఆసక్తిగొలుపుతున్న విషయం. వాట్సప్ లేదా వేరే ఇతర మెసేజింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా బంగారాన్ని గిఫ్టుగా ఎవరికైనా పంపచ్చు. సేఫ్ గోల్డ్అనే డిజిటల్ పెట్టుబడితో ఇది క్షణాల్లో సాధ్యమవుతుంది. కాబట్టి మీ సన్నిహితులకు సరైన టైంకు మంచి గిఫ్ట్ పంపలేకపోయామనే బాధకు విరుగుడు దొరికినట్టే. కస్టమర్లకు సేఫ్ గోల్డ్ ఆఫర్ చేసే గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్ తో సురక్షితంగా బంగారం కొనచ్చు. డిజిటల్ బంగారాన్నికొనడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి చాలా ఆప్షన్లన్నాయి. వాటిలో సేఫ్ గోల్డ్ కూడా ఒక ఆప్షన్. ఇలా బంగారం కొనాలంటే భద్రత గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. పేటీఎం, ఫోన్ పే వంటి సంస్థలు సేఫ్ గోల్డ్ భాగస్వామ్యం ఉన్నాయి.
Digital Gold: డిజిటల్ గోల్డ్ కొన్నారా? ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు ఇలా
SBI ATM cash: మీ ఏటీఎం కార్డుతో ఎంత డ్రా చేయొచ్చో తెలుసా? లిమిట్ ఇదే
గోల్డ్ గిఫ్ట్ ఇవ్వాలంటే ముందు సేఫ్ గోల్డ్ అకౌంట్ కు లాగిన్ అవ్వాలి. డాష్ బోర్డులో గిఫ్ట్ సెలెక్షన్ పై క్లిక్ చేయాలి. దీనికి మీరు స్టిక్కర్ కూడా యాడ్ చేయవచ్చు. ఈ స్టిక్కర్లో హ్యాపీ బర్త్ డే లేదా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వంటి మీకు కావాల్సిన స్టిక్కర్ ను జత చేయవచ్చు. గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నారో వారి మొబైల్ నంబర్ , ఎంత మొత్తానికి గోల్డ్ గిఫ్ట్ చేయాలో ఆ మొత్తాన్ని ఎంటర్ చేయాలి. అసలు ఇప్పటి వరకూ మీరు ఇలా బంగారు కొనకుండా మొట్టమొదటి సారి కొంటున్నట్టైతే ముందు బంగారు కొనాలన్నమాట. ఇక మీరు ఎవరికి ప్రెజెంట్ చేస్తున్నారో వారికి గోల్డ్ రిడీమ్ చేసుకునేందుకు SMS ద్వారా లింక్ వస్తుంది. సేఫ్ గోల్డ్ అకౌంట్ లోకి లాగిన్ అయి, గోల్డ్ గిఫ్ట్ సొంతం చేసుకోవచ్చు. ఇందుకు OTP కూడా వస్తుంది. సేఫ్ గోల్డ్ లో అకౌంట్ లేకపోయినా వాట్సప్ లిక్ ద్వారా గిఫ్ట్ తీసుకోవచ్చు. కానీ అతి తెలివి ఉపయోగించి మీకు మీరు గోల్డ్ గిఫ్ట్ చేసుకోవాలంటే మాత్రం అది సేఫ్ గోల్డ్ లో మాత్రం సాధ్యం కాదు. కేవలం ఇతరులకు బహుమానంగా ఇచ్చేందుకే ఈ ఆన్ లైన్ సేవలు ఉపయోగపడతాయి.
SBI Debit Card: మీ ఏటీఎం కార్డు పోయిందా? రెండు నిమిషాల్లో బ్లాక్ చేయండిలా
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు తీసుకుంటే రూ.6500 బెనిఫిట్స్
ఈ లింక్ క్లిక్ చేసి ఇన్ స్టాల్ చేసుకుంటే గోల్డ్ కలర్ లోకి మారుతుందనే మెసేజ్ వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సైబర్ నేరగాళ్లు మీ డబ్బుపై కన్నేసి, మిమ్మల్ని స్మార్ట్ గా దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయంపై అవగాహన పెంచుకోండి. వాట్సప్ గోల్డ్ పేరుతో వెలుగులోకి వస్తున్న మోసాలు తెలుసుకుంటే మీరు షాక్ అవ్వక తప్పదు. వాట్సప్ గోల్డ్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా వైరస్ ను జొప్పించి, సర్వం దోచేస్తారు. మీ పర్సనల్ డేటాను చోరీ చేసేందుకు ఈ మాల్ వేర్ ను ప్రయోగించే సైబర్ నేరగాళ్లు, మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ క్షణాల్లో లూటీ చేసేస్తారు. అసలు వాట్సప్ ఎలా వస్తుందన్న విషయం ఎప్పుడూ మరవద్దు. కేవలం యాప్ స్టోర్ నుంచే ఇది వస్తుంది కానీ లింక్ ద్వారా కాదుకదా. మరి ఇలాంటి ఫేక్ లింక్స్ ఎందుకు డౌన్ లోడ్ చేసుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Silver rates, Whatsapp