Home /News /business /

GIFT FUEL VOUCHERS TO LOVED ONES INDIAN OIL INTRODUCES NEW SCHEME TWITTER REACTIONS IS HERE AK GH

Indian Oil Fuel Vouchers: ఇండియన్ ఆయిల్ నుంచి ఫ్యూయల్ వోచర్లు.. ఈ గిఫ్ట్స్‌పై నెటిజన్ల స్పందన ఎలా ఉందంటే..

ఆయిల్ వోచర్లు

ఆయిల్ వోచర్లు

సంస్థ అధికారిక పోర్టల్ నుంచి ఎలక్ట్రిక్ ఫ్యూయల్ (e-fuel) వోచర్లను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఇది వివాహాలు, ఇతర ఫంక్షన్లలో ఇవ్వడానికి సరైన గిఫ్ట్స్ అని కంపెనీ ట్విట్టర్లో ప్రకటనలు ఇచ్చింది.

దేశంలోనే అగ్రశ్రేణి ఆయిల్ రిఫైనరీ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్తగా ఫ్యూయల్ వోచర్లను ప్రవేశపెట్టింది. పండుగ సీజన్ సందర్భంగా వీటిని ఇతరులకు బహుమతిగా ఇచ్చే పథకాన్ని ప్రకటించింది. వన్ ఫోర్ యు (One4U) పేరుతో ఈ బహుమతులను ఇండియన్ ఆయిల్ ప్రవేశపెట్టింది. సంస్థ అధికారిక పోర్టల్ నుంచి ఎలక్ట్రిక్ ఫ్యూయల్ (e-fuel) వోచర్లను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఇది వివాహాలు, ఇతర ఫంక్షన్లలో ఇవ్వడానికి సరైన గిఫ్ట్స్ అని కంపెనీ ట్విట్టర్లో ప్రకటనలు ఇచ్చింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని ఐఓసీఎల్ (IOCL) దీపావళి, ధన త్రయోదశి పండుగల సందర్భంగా ఈ ప్రచారం చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఫ్యూయల్ వోచర్ కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.10,000 ధరలో అందుబాటులో ఉంది. ‘వివాహ వేడుకల సందర్భంగా ఇవ్వగలిగే సరైన బహుమతి ఇది. ఈరోజే ఇండియన్ ఆయిల్ వన్ ఫోర్ యు ఎలక్ట్రిక్ ఫ్యూయల్ వోచర్ పొందండి. మీ ప్రియమైన వారికి ప్రేమతో ఈ గిఫ్ట్‌ వోచర్ ఇవ్వండి’ అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఈ వోచర్లను 30 రోజుల్లో వినియోగించకపోతే నూరుశాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్యూయల్ వోచర్ల వినియోగం ద్వారా రివార్డు పాయింట్లు పొందవచ్చు. వీటితో షాపింగ్ చేసుకోవచ్చు. ఈ వోచర్ల ద్వారా ఇంధనం నింపుకుంటే సర్ ఛార్జీలు మినహాయిస్తారు. ఫ్యూయల్ వోచర్లు ఉపయోగించడం ద్వారా ఎడ్జ్ రివార్డ్ లాయల్టీ పాయింట్లు కూడా పొందవచ్చు. అయితే ఈ గిఫ్ట్ వోచర్ ఆఫర్లపై వినియోగదారులతో పాటు నెటిజన్ల నుంచి కూడా మిశ్రమ స్పందన లభించింది. వీటిపై నెటిజన్లు ఎలా ట్వీట్ చేస్తున్నారో చూద్దాం.

ఇంధన ధరలు పెరుగుతున్న సమయంలో ఇది సరైన ప్రకటన.. అయితే దీని వల్ల కొందరు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఒక వ్యక్తి ట్విట్టర్లో స్పందించారు. ఇంధన ధరలు పెరిగి సాధారణ జనం చస్తుంటే, ఐఓసీఎల్ లాభాలు పిండుకుంటోందని మరొకరు ట్వీట్ చేశారు. ‘మీ స్నేహితుల వివాహాలకు ఖరీధైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. వారికి పెట్రోల్, డీజిల్ వోచర్ ఇవ్వొచ్చు. పెట్రోల్, డీజిల్ నింపుకున్న ప్రతిసారీ వారికి మీరు గుర్తుకు వస్తారు’ అని ఒక ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు.

ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో కొందరు వోచర్లను బంగారంతో పోల్చారు. ఐఓసీఎల్ కంపెనీకి కామెడీగా అనిపించినా ఈ ధనత్రయోదశికి బంగారం బదులుగా ఫ్యూయల్ వోచర్లు కొనుగోలు చేసుకుంటే మంచిదని ఒకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ‘ఇలాంటి గిఫ్ట్ కార్డులు కొత్తేమీ కాదు. ఫ్యూయల్ కార్డు బహుమతిగా ఇవ్వడం అంటే, మీ ప్రియమైన వారికి ప్రయాణ ఖర్చులను బహుమతిగా ఇచ్చినట్టే. ఈ పథకం చాలా బాగుంది’ అని మరొకరు రాశారు.

KCR నయా వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నారా ? అటు BJP.. మరోవైపు..

ఆ హోదాపై టీఆర్ఎస్ నేతల ఆశలు.. కేసీఆర్ ఆలోచన ఏంటి ?

Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంధన ధరల నేపథ్యంలో ఐవోసీఎల్ ప్రచారం ప్రజల ఆగ్రహానికి గురైంది. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 3న పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ట్యాక్స్ తగ్గించినా, ఇంధన ధరలు ఇంకా రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించకపోవడంతో పాత ధరలే అమలవుతున్నాయి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Kishore Akkaladevi
First published:

Tags: IOC

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు