GIC-Reliance Retail deal: రిలయన్స్ రిటైల్‌లో సింగపూర్ కంపెనీ రూ.5,512.5 కోట్ల పెట్టుబడులు

రిలయన్స్ రిటైల్‌లో సింగపూర్ కంపెనీ రూ.5,512.5 కోట్ల పెట్టుబడులు (credit - twitter)

GIC-Reliance Retail deal: పెట్టుబడులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తలుపులు తెరవగానే... ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి.

  • Share this:
    GIC-Reliance Retail deal: రిలయన్స్ అనే పదానికి అర్థం నమ్మకం. పేరుకు తగ్గట్టే రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతోంది. కంపెనీకి పెట్టుబడుల వరద పారుతోంది. తాజాగా సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ GIC... రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిటైల్ యూనిట్‌లో రూ.5,512.5 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. తద్వారా ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీల సరసన చేరబోతోంది. ఈ మధ్య కాలంలో... ఇది ఆరో పెట్టుబడి డీల్. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (RRVL) నుంచి 1.22 శాతం వాటాను పొందే ఈ డీల్‌ తో కలిపి... ప్రీ-మనీ ఈక్విటీ వాల్యూ రూ.4.285 లక్షల కోట్లకు చేరిందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అక్టోబర్ 2న తెలిపారు. "GIC ప్రపంచ నెట్‌వర్క్, దీర్ఘకాలిక భాగస్వామ్యాలు... భారత రిటైల్ వ్యవస్థను మెరుగుపరుస్తూ, మరింతగా మారుస్తాయి" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముఖేష్ అంబానీ తెలిపారు.

    "రిలయన్స్ రిటైల్... తన సప్లై చైన్‌, స్టోర్ నెట్‌వర్క్స్, లాజిస్టిక్స్, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కొనసాగిస్తూ... కస్టమర్లు, వాటాదారలకు మరింత మేలు కలిగిస్తారని మేం నమ్ముతున్నాం" అని GIC... సీఈఓ లిమ చౌ కియాత్ తెలిపారు.

    రిలయన్స్ రిటైల్ ఇప్పటివరకూ... రూ.30,360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇందుకోసం 6.87 శాతం వాటాను అమ్మింది.

    రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడుల వెల్లువ


    అక్టోబర్ 1న అబు దాబీ స్టేట్ ఫండ్ ముబాదలా ఇన్వెస్టిమెంట్ కంపెనీ... రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ యూనిట్‌లో 1.4 శాతం వాటా కొంటూ... రూ.6,247.5 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. మూడు వారాల్లో ఆరు డీల్స్ ద్వారా... రిలయన్స్ రిటైల్ ప్రీ మనీ ఈక్విటీ వాల్యూ రూ.4.285 లక్షల కోట్లకు చేరింది.

    రిలయన్స్ రిటైల్... ఇండియాలో అతి పెద్ద, అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత లాభదాయక వ్యాపార సంస్థ. ఇది దేశంలో 12,000 స్టోర్లతో 64 కోట్ల మందికి చేరువైంది.

    GIC ప్రపంచ పెట్టుబడుల సంస్థను... 1981లో స్థాపించారు. ఇది సింగపూర్ విదేశీ రిజర్వులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ స్థిరమైన పెట్టుబడులు పెడుతోంది. ఈక్విటీలు, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్, ప్రైవేట్ ఈక్విటీ, రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల్లో పెట్టుబడులు పెట్టింది. 20 ఏళ్లుగా ఈ కంపెనీ 40కి పైగా దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. దీని ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 10 ఆఫీసులతో... 1,700 మంది ఉద్యోగులతో ఫైనాన్షియల్ వ్యవహారాలు చూస్తోంది.

    Disclosure: Reliance Industries Ltd. is the sole beneficiary of Independent Media Trust which controls Network18 Media & Investments Ltd.
    Published by:Krishna Kumar N
    First published: