హోమ్ /వార్తలు /బిజినెస్ /

Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.4,950 మీ అకౌంట్‌లోకి

Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.4,950 మీ అకౌంట్‌లోకి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Monthly Income Scheme | పోస్ట్ ఆఫీసులో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.4,950 మీ అకౌంట్‌లోకి వస్తాయి. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకోండి.

మీరు ఏదైనా పొదుపు పథకాల్లో చేరాలనుకుంటున్నారా? లేదా ప్రతీ నెలా కొంత ఆదాయం వచ్చే స్కీమ్‌లో మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇండియా పోస్ట్ మీకు అద్భుతమైన అవకాశం ఇస్తోంది. పోస్ట్ ఆఫీసులో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో చేరితే ప్రతీ నెలా మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. నెలకు రూ.4,950 వరకు మీరు డబ్బులు పొందొచ్చు. ప్రతీ పోస్ట్ ఆఫీసులో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఉంటుంది. 10 ఏళ్ల వయస్సు దాటినవారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. మైనర్లు అకౌంట్ ఓపెన్ చేస్తే గార్డియన్ ఉండాలి. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ తెరవొచ్చు.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి డిపాజిట్ చేయొచ్చు. సింగిల్ అకౌంట్‌కు గరిష్టంగా రూ.4,50,000, జాయింట్ అకౌంట్‌లో రూ.9,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. ప్రస్తుతం 6.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఉదాహరణకు సింగిల్ అకౌంట్‌లో రూ.4,50,000 డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.29,700 వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ.2,475 మీ అకౌంట్‌లో జమ అవుతుంది. ఇక జాయింట్ అకౌంట్‌లో రూ.9,00,000 డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.59,400 వడ్డీ వస్తుంది. నెలకు రూ.4,950 మీ అకౌంట్‌లో జమ అవుతుంది.

Stock Market: రూ.1,00,000 పెట్టుబడి పెడితే వారం రోజుల్లో రూ.80,000 లాభం

Unlimited Data Plans: అన్‌లిమిటెడ్ డేటా కావాలా? Jio, Airtel, Vi, BSNL ప్లాన్స్ ఇవే

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో డిపాజిట్ చేసిన ఏడాది వరకు డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. ఏడాది నుంచి 3 ఏళ్ల మధ్య అకౌంట్ క్లోజ్ చేస్తే ప్రిన్సిపాల్ అమౌంట్‌లో 2 శాతం, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల మధ్య అకౌంట్ క్లోజ్ చేస్తే 1 శాతం తగ్గించి మిగతా డబ్బులు ఇస్తారు. ఈ స్కీమ్‌కు నామినేషన్ సదుపాయం కూడా ఉంది. ఒకవేళ అకౌంట్ హోల్డర్ మెచ్యూరిటీ కన్నా ముందు మరణిస్తే నామినీకి డబ్బులు ఇస్తారు.

PM Kisan Scheme: ఆ రైతుల నుంచి పీఎం కిసాన్ డబ్బులు వెనక్కి తీసుకుంటున్న కేంద్రం

Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉందా? ఇలా మార్చేయండి

భారీ మొత్తంలో డబ్బులు దాచుకొని ప్రతీ నెలా కొంత వడ్డీ పొందాలనుకునేవారికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ప్రతీ పోస్ట్ ఆఫీసులో ఈ అకౌంట్ తెరిచే అవకాశం ఉండటంతో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఒక పోస్ట్ ఆఫీసులో తెరిచిన అకౌంట్‌ను మరో పోస్ట్ ఆఫీస్‌కి మార్చుకోవచ్చు. సింగిల్ అకౌంట్‌ని జాయింట్ అకౌంట్‌గా, జాయింట్ అకౌంట్‌ని సింగిల్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు.

First published:

Tags: Investment Plans, Personal Finance, Post office, Post office scheme, Postal department

ఉత్తమ కథలు