State Bank Of India | దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తీపికబురు అందించింది. అదిరే ఆఫర్ అందుబాటులో ఉంచింది. కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంచింది. హాలిడే ప్యాకేజ్ ప్లాన్ చేసుకునే వారికి ఈ ఆఫర్ (Offer) అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్త ఏడాది వస్తోంది. జనవరి 1న హాలిడే వెళ్లాలని భావించే వారు ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు.
స్టేట్ బ్యాంక్ తాజాగా హాలిడే ప్యాకేజీల మీద ఏకంగా రూ. 40 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. దీని కోసం ప్రత్యేకమైన కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. కూపన్ కోడ్ ఎస్బీఐఎంఎంటీ అని ఉంటుంది. దీన్ని ఎంటర్ చేస్తేనే తగ్గింపు సొంతం చేసుకోగలం. లేదంటే ఎలాంటి తగ్గింపు ప్రయోజనాలు లభించవు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఎస్బీఐ డెబిట్ కార్డు వాడే కార్లు ఎవరైనా ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు.
శుభవార్త.. రూ.3 వేలకు పైగా పతనమైన బంగారం ధర.. ఆల్‌టైమ్ గరిష్టం నుంచి..
హాలిడే ప్యాకేజ్ బుక్ చేసుకోవాలని భావించే వారు ముందుగా ఎస్బీఐ యోనో యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ యూజర్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. తర్వాత షాప్ అండ్ ఆర్డర్ సెక్షన్లోకి వెళ్లాలి. తర్వాత హాలిడే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అటు పైన మేక్మైట్రిప్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మీకు నచ్చిన ప్యాకేజీని కొనుగోలు చేయొచ్చు. అయితే ఇక్కడ ప్యాకేజీ ప్రాతిపదికన మీకు వచ్చే ఆఫర్లు కూడా మారుతూ ఉంటాయని గుర్తించుకోవాలి.
కస్టమర్లకు భారీ షాకిచ్చిన 2 బ్యాంకులు.. ఈరోజు నుంచి..
ఇకపోతే మేక్ టై ట్రిప్ ద్వారా బుక్ చేసుకునే ప్యాకేజీలకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని గుర్తించుకోవలి. ఎందుకంటే ఎస్బీఐ కార్డు, మేక్ మై ట్రిప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. యోనో యాప్‌లోని మేక్ మై ట్రిప్ ద్వారా మీకు నచ్చి హాలిడే ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.
మరోవైపు ఎస్బీఐ ఇటీవలనే మరో కీలక ప్రకటన కూడా చేసింది. ఈఎంఐ ప్రాసెసింగ్ లాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజును రూ. 99 నుంచి రూ.199కు పెంచేసింది. దీనికి జీఎస్టీ అదనం. అలాగే మరో నిర్ణయం కూడా తీసుకుంది. అద్దె చెల్లింపులపై కూడా ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. రూ. 99 చార్జీ చెల్లించాలి. దీనికి జీఎస్టీ అదనం అని గుర్తించుకోవాలి. మరోవైపు ఎస్బీఐ కార్డు కూడా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రివార్డు పాయింట్లలో కోత విధించింది. అమెజాన్ ద్వారా బుక్ చేసుకునే ప్రొడక్టులపై రివార్డు పాయింట్లు తక్కువగా రానున్నాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ATM, Banks, Debit card, Sbi, Sbi card