• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GET UP TO RS 5000 PENSION PER MONTH AFTER 60 YEARS OF AGE BY CONTRIBUTING RS 42 TO RS 210 IN ATAL PENSION YOJANA SS

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజనతో నెలకు రూ.5,000 వరకు పెన్షన్

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజనతో నెలకు రూ.5,000 వరకు పెన్షన్

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజనతో నెలకు రూ.5,000 వరకు పెన్షన్ (ప్రతీకాత్మక చిత్రం)

Atal Pension Yojana | ఈ స్కీమ్‌లో చేరే ముందు మీకు 60 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ కావాలనుకుంటున్నారో ముందే లెక్కేసుకొని డబ్బులు జమ చేయాలి.

  • Share this:
    అటల్ పెన్షన్ యోజన... కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పెన్షన్ స్కీమ్. రిటైర్మెంట్ తర్వాత నెలనెలా పెన్షన్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ-PFRDA నిర్వహిస్తుంది. పౌరులకు కనీస పెన్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో చేరాలంటే వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రతీ ఒక్కరికి బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఈ స్కీమ్‌లో ప్రతీ నెల లేదా మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. ఏ వయస్సులో స్కీమ్‌లో చేరినా 60 ఏళ్ల వరకు పొదుపు చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత ప్రతీ నెల పెన్షన్ లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరినవారికి ఆదాయపు పన్ను చట్టంలోని 80 సీసీడీ (1) కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.

    జమ చేయాల్సిన మొత్తం లబ్ధిదారుల వయస్సు, పొందాలనుకునే పెన్షన్‌పై ఆధారపడి ఉంటుంది. మీ కంట్రిబ్యూషన్‌ను బట్టి నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందొచ్చు. ఉదాహరణకు ఓ వ్యక్తి 18 ఏళ్ల వయస్సులో అటల్ పెన్షన్ యోజనలో చేరితే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 పెన్షన్ పొందేందుకు నెలకు రూ.42 జమ చేయాలి. అదే రూ.5,000 పెన్షన్ పొందాలంటే రూ.210 జమ చేయాలి. ఈ స్కీమ్‌లో చేరడానికి గరిష్ట వయస్సు 40 ఏళ్లు. అదే 40 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్‌లో చేరితే రూ.1,000 పెన్షన్ కోసం నెలకు రూ.291 జమచేయాలి. ఒకవేళ రూ.5,000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.1,454 జమ చేయాలి. అందుకే ఈ స్కీమ్‌లో చేరే ముందు మీకు 60 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ కావాలనుకుంటున్నారో ముందే లెక్కేసుకొని డబ్బులు జమ చేయాలి. పథకంలో చేరిన వయస్సు, జమ చేసిన మొత్తం, స్వీకరించే పెన్షన్‌లో తేడాలను ఈ చార్ట్‌లో చూడొచ్చు.

    Atal Pension Scheme, Atal Pension Scheme in telugu, Atal Pension Scheme details, atal pension scheme, atal pension yojana benefits, atal pension yojana 2019, atal pension yojana review, అటల్ పెన్షన్ స్కీమ్, అటల్ పెన్షన్ యోజన, అటల్ పెన్షన్ లాభాలు, అటల్ పెన్షన్ యోజన 2019, అటల్ పెన్షన్ యోజన వివరాలు, అటల్ పెన్షన్ స్కీమ్ వివరాలు, అటల్ పెన్షన్ పథకం

    నెలనెలా పెన్షన్‌తో పాటు లబ్ధిదారుడు మరణిస్తే నామినీకి లభించే పెన్షన్ కార్పస్ వివరాలివే...

    రూ.1,000 పెన్షన్ పొందేవారికి రూ.1,70,000.
    రూ.2,000 పెన్షన్ పొందేవారికి రూ.3,40,000.
    రూ.3,000 పెన్షన్ పొందేవారికి రూ.5,10,000.
    రూ.4,000 పెన్షన్ పొందేవారికి రూ.6,80,000.
    రూ.5,000 పెన్షన్ పొందేవారికి రూ.8,50,000.

    ఆలస్యంగా పేమెంట్ చేస్తే నెలకు ప్రతీ వందకు రూ.1 జరిమానా చెల్లించాలి. పథకాన్ని మధ్యలో నిలిపేసినవాళ్లు పెనాల్టీ చెల్లించి రెన్యువల్ చేసుకోవచ్చు. పథకాన్ని మధ్యలో ఆపెయ్యాలనుకుంటే అకౌంట్ మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించి జమ చేసిన మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరినవాళ్లు 60 ఏళ్ల లోపు చనిపోతే జీవిత భాగస్వామి అటల్ పెన్షన్ యోజన అకౌంట్‌ను కొనసాగించొచ్చు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ చనిపోతే నామినీకి పెన్షన్ కార్పస్ లభిస్తుంది.

    Abdul Kalam Birth Anniversary: మీలో స్ఫూర్తిని రగిలించే అబ్దుల్ కలాం సూక్తులు



    ఇవి కూడా చదవండి:

    SBI Alerts: ఎస్‌బీఐ ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తున్నాయా? రాకపోతే ఇలా రిజిస్టర్ చేసుకోండి

    IRCTC: మీ రైలు టికెట్ మరొకరి పేరు మీదకు మార్చాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

    Aadhar Reprint: ఆధార్ కార్డు పోయిందా? ఈ స్టెప్స్ ఫాలో అవండి
    First published: