దేశంలో పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు కొనుగోలుదారులను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. కరోనా మహమ్మారి కారణంగా వాహనాల అమ్మకాలు నెమ్మదించాయి. ఈ మేరకు దసరా, దీపావళి నాటికి అమ్మకాలు జోరందుకుంటాయని ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. స్వదేశీ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఈ పండుగ కాలానికి అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నట్టు తెలిపింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 నుంచి అల్టురాస్ జి 4 ఎస్యూవీ వరకు... మోడళ్లను బట్టి రూ.3 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చని ప్రకటించింది. సెప్టెంబరు నెలకు గాను క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఆఫర్లో భాగంగా ఉచిత ఉపకరణాలను కూడా అందించనున్నారు. మహీంద్రా కంపెనీ బీఎస్-6 మోడల్ ఎస్‌యూవీలపై ఆఫర్లు ప్రకటించింది.
మహీంద్రా కంపెనీ అల్టురాస్ జి 4 ఫ్లాగ్షిప్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. దీనిని రూ.2.4 లక్షల నగదు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ వరుసగా రూ.50,000, రూ.15,000 వరకు ఉన్నాయి. ఎస్‌యూవీలపై ఈ ఆఫర్లు 2020 సెప్టెంబర్ 30 వరకు చెల్లుతాయి. మహీంద్రా ఎక్స్యువి 500ను రూ.12,760 వరకు నగదు తగ్గింపుతో, రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కొనుగోలు చేయవచ్చు. వీటికి అదనంగా రూ.5,000 విలువైన ఉపకరణాలతో పాటు రూ.9,000 వరకు కార్పొరేట్ తగ్గింపు కూడా ఉంది. ఈ ఆఫర్లు అన్ని XUV500 మోడళ్లకూ వర్తిస్తాయని సంస్థ తెలిపింది.
Vehicle Insurance: మీ బండికి ఏ ఇన్స్యూరెన్స్ ఉంది? ఏ బీమా తీసుకుంటే ఏం లాభమో తెలుసా?
Loan EMI: లోన్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? ఈ ఛాన్స్ మీకోసమే
మహీంద్రా XUV300 మోడళ్లపై అందిస్తున్న డిస్కౌంట్లలో ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రమే ఉన్నాయి. కొనుగోలుదారులు రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్‌తో పాటు రూ.4,500 కార్పొరేట్ ఆఫర్ కూడా పొందవచ్చు. మహీంద్రా ఎంపీవీపై నగదు ఆఫర్ రూ.10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.15,000 వరకు ఉంది. మరాజో మోడల్‌పై కూడా ఆఫర్లను ఆ సంస్థ ప్రకటించింది. వీటిలో కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6,000, రూ.5,000 విలువ చేసే ఉపకరణాలు ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియోపై ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.25,000, కార్పొరేట్ ఆఫర్ రూ.5,000 వరకు పొందవచ్చు. దేశీయంగా తయారుచేసిన ఎస్5 మోడల్‌పై అదనంగా రూ.20,000 నగదు తగ్గింపును అందిస్తున్నారు. వీటికి రూ.10,000 విలువైన ఉపకరణాలు అదనం. మహీంద్రా బొలెరోపై రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను సంస్థ అందిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Automobiles, BUSINESS NEWS, CAR, Cars