Money Tips: రోజూ రూ.100 పొదుపుతో రూ.28 లక్షల రిటర్న్స్

Money Tips: రోజూ రూ.100 పొదుపుతో రూ.28 లక్షల రిటర్న్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Money Tips | మీకు పొదుపు చేసే అలవాటు ఉందా? రోజూ రూ.100 పొదుపుతో మీరు రూ.28 లక్షల రిటర్న్స్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    ఇప్పుడు పొదుపు చేసిన డబ్బే భవిష్యత్తులో అవసరాలు తీరుస్తుంది. అత్యవసర సమయాల్లో ఆదుకుంటుంది. అంతేకాదు... లక్షలు కూడబెట్టాలన్నా ఇప్పట్నుంచే పొదుపుచేయడం అవసరం. పొదుపు చేయడానికి అనేక మార్గాలున్నాయి. సేవింగ్స్ స్కీమ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్‌‌లో పొదుపు చేయొచ్చు. మిగతావాటితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి రిటర్న్స్ వస్తాయని కొన్నేళ్ల డేటా పరిశీలిస్తే తెలుస్తుంది. కొంతకాలంగా స్టాక్ మార్కెట్ పరిస్థితి బాగాలేదు కాబట్టి రిటర్న్స్ పెద్దగా లేవు కానీ... గత 15-20 ఏళ్లుగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినవారికి మంచి రిటర్న్స్ వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ కాలం పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ పొందొచ్చు. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్-SIP ద్వారా పెట్టుబడి పెట్టి మంచి రిటర్న్స్ పొందొచ్చు.

    Jan Dhan Account: జన్ ధన్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ ఉందని మీకు తెలుసా?

    Government Bond: ఈ ప్రభుత్వ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం

    ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లు చూస్తే 7 శాతం వరకు ఉన్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 10 శాతం లోపే ఉంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్ చూస్తే కనీసం 12 నుంచి 24 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. 20 శాతం అనుకున్నా బాగానే రిటర్న్స్ వస్తాయి. ఉదాహరణకు ఓ వ్యక్తి రోజుకు రూ.100 చొప్పున నెలకు రూ.3,000 సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్-SIP లో 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ.5,40,000. కానీ 20 శాతం వడ్డీ చొప్పున లెక్కిస్తే మీకు రూ.28 లక్షల రిటర్న్స్ వస్తాయి. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా ఐదు రెట్లు ఎక్కువగా పొందొచ్చు.

    మ్యూచువల్ ఫండ్స్‌లో ఇలా మంచి రిటర్న్స్ పొందాలంటే మీరు సరైన ఫండ్ ఎంచుకోవాలి. మార్కెట్‌లో వేర్వేరు కంపెనీలు అందించే మ్యూచువల్ ఫండ్స్ వందల్లో ఉంటాయి. వాటిలో మంచి రిటర్న్స్ ఇచ్చే ఫండ్ ఎంచుకుంటేనే మీకు బాగా లాభాలు ఉంటాయి. లేకపోతే మీరు పెట్టిన పెట్టుబడి కన్నా తక్కువ చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇందుకు కారణం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ స్టాక్ మార్కెట్లలో ఉంటాయి. మీరు ఎంచుకున్న ఫండ్ మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే మీకూ మంచి లాభాలు వస్తాయి. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అన్ని వివరాలు సరిగ్గా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి.
    Published by:Santhosh Kumar S
    First published: